Begin typing your search above and press return to search.

యాక్టింగ్ రాదని ఒప్పుకో యంగ్ హీరోయిన్ పై నెటిజన్ల ఫైర్

By:  Tupaki Desk   |   1 Jun 2020 4:30 AM GMT
యాక్టింగ్ రాదని ఒప్పుకో యంగ్ హీరోయిన్ పై నెటిజన్ల ఫైర్
X
రష్మిక మందన అంటే అందరికి తెలిసిందే. అందం అభినయంతో ఆకట్టుకుంటుంది. కన్నడ నుండి వచ్చిన ఈ భామ తెలుగు టాప్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ని స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుకుంటుంది. కానీ టాప్ హీరోయిన్ అయ్యేసరికి కొందరు హీరోయిన్లకు కొమ్ములు వస్తాయంటారు. ఇటీవలే ఓ భారీ రీమేక్ సినిమా విషయంలో అమ్మడు అదే చేసిందట. గతేడాది నాని హీరోగా రూపొందిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ 'జెర్సీ'. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ నాని భార్యగా యాక్టింగ్ బాగా చేసింది. ఆ పాత్రకు ప్రశంసలు కూడా దక్కాయి. అలాంటి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రను రష్మిక రిజెక్ట్ చేసిందట.

మాములుగా ఆ సినిమా చూస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి మరీ ఆ పాత్రకు ఒప్పుకుంటారు. కానీ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న రష్మిక ఎందుకు నో చెప్పిందని చర్చ జరుగుతుంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్.. ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా రూపొందిస్తున్నాడు. ఇక షాహిద్ భార్య పాత్రకు రష్మికను అడిగారట. కానీ అమ్మడు సిల్లీ కారణాలతో తప్పుకుందట. ఈ సినిమాలో నటించడానికి రష్మిక రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసిందని టాక్. కానీ ఈ వార్తల పై రష్మిక స్పందించి క్లారిటీ ఇచ్చింది. "నిజానికి అందరూ అనుకున్నట్లు నేను ఈ సినిమాను రెమ్యూనరేషన్ కోసం రిజెక్ట్ చేయలేదు. ఆ పాత్ర చాలా లోతైన ఎమోషన్స్ కలిగి ఉంది. అంత హెవీ ఎమోషన్స్ నేను చేయలేను. నా పరిధిలో నేను చేయగలను.

శ్రద్దా శ్రీనాథ్ ఆ పాత్ర బరువును మోసినట్లుగా ఆ పాత్ర బరువు నేను మోయలేనంటూ.. చెప్పుకొచ్చింది. అంతేగాక డేట్స్ కూడా అడ్జస్ట్ అవ్వలేదు అనడం అని కొసమెరుపు". ఇక రష్మిక మాటలపై నెటిజన్లు.. సినీ వర్గాలు ఫైర్ అవుతున్నాయి. ఒక పాత్ర ఎమోషన్స్ మోయలేనప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ ఎంచుకోవడం ఎందుకు.. కేవలం ఫన్నీ.. లవ్ స్టోరీస్ మాత్రమేనా నువ్ ఎంచుకునేది? అంటూ ఫైర్ అవుతున్నాయి. సింపుల్ గా ఆ పాత్ర నేను చేయలేను అని చేతులెత్తేసావు.. మరి యాక్టింగ్ రాదని కూడా ఒప్పుకో.." అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ తో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఈ సినిమా నిర్మాణంలో అల్లు అరవింద్, దిల్ రాజులు భాగస్వామ్యం అవడం విశేషం.