ఒక్కసారి పెళ్లి కాలేదు.. కానీ శీలం కోల్పోయా: శ్రీరెడ్డి

Sat May 23 2020 11:30:24 GMT+0530 (IST)

Here Is What Sri Reddy Says About Rana Marriage

శ్రీరెడ్డి.. ఈ వివాదాస్పద నటి టాలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ ను బయటపెట్టి.. నగ్నంగా ‘మా’ ఆఫీసు ముందు రచ్చ చేసి.. ఇప్పటికీ టాలీవుడ్ లోని గుట్టుమట్లను బయటపెడుతూనే ఉంది. ఎప్పుడు ఏ హీరో మీద.. ఏ రాజకీయ నాయకుడిపై విరుచుకుపడుతుందో ఎవరికీ తెలియదు.ఈ మధ్య తమిళ సినిమా అవకాశాలు రావడంతో చెన్నైకి షిఫ్ట్ అయిన శ్రీరెడ్డి అక్కడ సినిమాలు చేసుకుంటూనే తెలుగు రాష్ట్రాల అప్ డేట్స్ పై సోషల్ మీడియాలో స్పందిస్తోంది.

తాజాగా రానా-మిహికా బజాజ్ ఒక్కటవ్వడంపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ చేసింది. ‘నీ లైఫ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారూ.. ఈ అమ్మాయితో ప్రశాంత జీవితం కొనసాగించాలి’ని పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి ఇలా పాజిటివ్ గా స్పందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇక మరో పోస్టులో ‘రామానాయుడు స్టూడియోలో రానా బావా ఎంగేజ్ మెంట్.. తరువాత నాదే’ అంటూ మరో పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి ఈ పోస్టులో రానాను బావా అంటూ పిలవడం చర్చనీయాంశమైంది.

ఇక తాజాగా మరో పోస్టు వైరల్ అవుతోంది.‘‘నాకు కనీసం ఒక్కసారి కూడా పెళ్లి కాలేదని.. కానీ శీలాన్ని కోల్పోయానని.. ఎవరైనా దీనిపై ఫేక్ న్యూస్ వార్తలు రాస్తే అతన్నే పెళ్లి చేసుకుంటానని’ సెటైర్లు వేస్తూ హాట్ కామెంట్ చేసింది. ఇలా తన గురించి.. రానా కొత్త జీవితం గురించి హాట్ కామెంట్స్ చేసి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది.