బ్లాక్ అండ్ వైట్ లో హెబ్బా హాయిరబ్బా!

Sun Nov 28 2021 08:00:01 GMT+0530 (IST)

Hebba Black and White Photos

`కుమారి 21 ఎఫ్` చిత్రంతో ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆరంభమే బ్లాక్ బస్టర్ కొట్టి ఆ తర్వాత ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. ఆరంగేట్రమే ఈ అమ్మడు యూత్ ని టార్గెట్ చేసిందంటే హెబ్బా ఇంపాక్ట్ ఏస్థాయికి చేరిందో చెప్పొచ్చు. అయితే ఆ ఛరిష్మాని ఎంతో కాలం కొనసాగించలేకపోయింది. ప్రతిసారీ బోల్డ్ అండ్ డస్కీ ప్రయత్నాలు చేసినా యువత సైతం పెదవి విరిచేసారు. `24 కిస్సెస్`..`ఏంజెల్ `చిత్రాల్లో తనలో బోల్డ్ యాంగిల్ ని హైలైట్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. యువతకి ఫ్రెష్ ఫీల్ ని అందించడంలో విఫలమైంది. అయితే కెరీర్ ఆరంభం నుంచే మీడియం రేంజ్ హీరోలతో అయినా ఛాన్సులు దక్కించుకోలేక నవతరంతో సరిపెట్టుకోవాల్సొచ్చింది.ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన `రెడ్` చిత్రంతో ఐటం బాంబ్ గా ఎంట్రీ ఇచ్చింది గానీ ఆ ఇమేజ్ కలిసి రాలేదు. సినిమా సక్సెస్ అవ్వకపోడంతో ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆశలన్ని వాటిపైనే. `తెలిసిన వాళ్లు`..`ఒడేలా రైల్వే స్టేషన్` చిత్రాలు ఆన్ సెట్స్ ఉన్నాయి. కానీ వాటి అప్ డేట్స్ మాత్రం లేవు. షూటింగ్ ప్రారంభమై చాలా కాలమవుతోంది. కానీ మళ్లీ ఎలాంటి వివరాల్ని యూనిట్ తెలపలేదు. దీంతో ఈ రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయా? క్యాన్సిల్ అయ్యాయా? అన్నది సందేహంగానే మారింది.

ఆ సంగతిని పక్కనబెడితే! హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టాని టెంప్టింగ్ ఫోటోలతో హీటెక్కిస్తూ నిరంతరం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంది. తాజాగా మరోసారి ఇన్ స్టా వేదికగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్ తో అగ్గి రాజేసింది. జీన్స్ ఫ్యాంట్..షర్ట్ ధరించి లో దుస్తులు కనిపించేలా కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.