బిగ్ బాస్-2లోకి ఆ హాట్ హీరోయిన్ ఎంట్రీ?

Wed Jul 11 2018 15:12:12 GMT+0530 (IST)

Hebah Patel Wild Card Entry in Bigg Boss 2

తెలుగు ‘బిగ్ బాస్’ మీద ఈసారి లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. తొలి సీజన్ తో పోలిస్తే ఈసారి ఏమంత ఆసక్తికరంగా షో నడవట్లేదని పెదవి విరిచారు మెజారిటీ ప్రేక్షకులు. ఎన్టీఆర్ స్థాయిలో నాని హోస్ట్ గా పెర్ఫామ్ చేయలేకపోవడం ఒక మైనస్ అయితే.. పార్టిసిపెంట్ల విషయంలో ఏమంత ఆకర్షణ లేకపోవడం.. వాళ్ల తీరు మరింత ప్రతికూలంగా మారాయి. ఐతే షో మీద వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బట్టి మార్పులు చేర్పులు చేస్తుండటంతో రోజులు గడిచేకొద్దీ ‘బిగ్ బాస్’పై వ్యతిరేకత తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ షోకు ఇంకా ఆకర్షణ పెరగాల్సి ఉంది. ఇందుకోసం తొలి సీజన్లో దీక్షా పంత్ తరహాలో ఈసారి ఒక హాట్ పార్టిసిపెంట్ ను హౌస్ లోకి తేవాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టిసిపెంట్ ‘కుమారి 21 ఎఫ్’ భామ హెబ్బా పటేల్ అని వినిపిస్తోంది.ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో నందిని అనే అమ్మాయి హౌస్ లోకి వచ్చింది. కానీ ఆమె వల్ల షోకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆమె హౌస్ లో అందరిలాగే ఉంటోంది. దీక్ష లాగా హాట్ హాట్ వేషాలేమీ వేయట్లేదు. హడావుడి చేయట్లేదు. ఈ విషయంలో నిర్వాహకులు హెబ్బా మీద ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఆమెతో ఇప్పటికే సంప్రదింపులు నడుస్తున్నాయట. కానీ ఆమె ఓకే అందా లేదా అన్నది తెలియడం లేదు. తెరమీద చాలా బోల్డ్ గా కనిపించే హెబ్బా.. షోలోకి వస్తే కచ్చితంగా ఆకర్షణ పెరుగుతుందని.. యువతను ఆమె బాగా షో వైపు ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. ఈ వీకెండ్లో ఈ విషయమై ఒక క్లారిటీ వస్తుందంటున్నారు. ఇంతకుముందు తీరిక లేకుండా సినిమాలు చేసిన హెబ్బాకు.. ఇప్పుడు సరిగా అవకాశాలు రావట్లేదు. ‘24 కిసెస్’ అనే సినిమాను పూర్తి చేసిన హెబ్బాకు చేతిలో ఇంకే సినిమా లేదు కాబట్టి ఆమెకు మంచి పే చెక్ ఇస్తే షోకి రావడానికి అభ్యంతరమేమీ లేకపోవచ్చు.