హత్య ట్రైలర్: విజయ్ ఆంటోని సాలిడ్ క్రైమ్ స్టోరీతో!

Mon Aug 15 2022 20:30:57 GMT+0530 (IST)

Hatya Trailer

`బిచ్చగాడు` విజయంతో విజయ్ ఆంటోని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి తెలుగులో తన సినిమాలను రెగ్యులర్ గా విడుదల చేస్తున్నాడు. ఆయన తాజా చిత్రం `హత్య` ట్రైలర్ నేడు విడుదలైంది. విజయ్ ఆంటోని- రితికా సింగ్- మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కింది. టైటిల్ తోనే థీమ్ ను రివీల్ చేయడం ఆసక్తికరం.మీనాక్షి చౌదరి హత్యకు గురైన మోడల్ గా నటించింది. మీనాక్షి హత్య కేసును దర్యాప్తు చేసే వ్యక్తులుగా విజయ్ ఆంటోనీ - రితికా సింగ్ ఈ ట్రైలర్ లో కనిపించారు. ఇక ఈ మర్డర మిస్టరీ ట్రైలర్ చూడగానే సంథింగ్ స్పెషల్ మేకింగ్ స్టైల్ ఇది అని అంగీకరించి తీరాల్సిందే. ట్రైలర్ మాస్టర్ క్లాస్ లో కట్ చేసారు. అలాగే ఒక పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ మూవీకి ఏం కావాలో ఆ టెక్నికాలిటీస్ ఈ మూవీలో ఉన్నాయని ట్రైలర్ భరోసానిస్తోంది.

ఒక అందమైన మోడల్ హత్య చుట్టూ తిరిగే కథాంశం కాబట్టి కుర్చీ అంచున కూచుని చూసేంతగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని తెరకెక్కించారని అర్థమవుతోంది.  గ్లామర్ ప్రపంచపు చీకటి కోణాలను కూడా ఇందులో ఆవిష్కరిస్తున్నారు. ఆసక్తికరంగా పాత్రధారులు ధరించిన దుస్తులు కానీ బ్యాక్ గ్రౌండ్ కానీ ఎంతో రిచ్ గా క్లాసిక్ డే కాలపు ఎలివేషన్ తో ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాకి ఎంచుకున్న స్క్రీన్ ప్లే ఫార్మాట్ రీఫ్రెషింగ్ గా ఉంటుందని కూడా ట్రైలర్ చూస్తే అర్థమైంది. మరో మాస్టర్ క్లాస్ మూవీని విజయ్ ఆంటోని నుంచి ఆశించవచ్చు. ఇక ఇందులో విజయ్ ఆంటోని.. మీనాక్షి  సాలిడ్ ఎక్స్ ప్రెషన్స్ హైలైట్ అని కూడా ప్రశంసించాలి. హత్య ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీలో డిటెక్టివ్ పాత్ర ఎంతో ఆసక్తిని పెంచుతోంది.

లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా- జి.ధనుంజయన్- ప్రదీప్ బి- పంకజ్ బోరా- విక్రమ్ కుమార్- తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై- సిద్ధార్థ్ శంకర్- ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సందడిగా ప్రెస్ మీట్ నిర్వహించారు. మూవీ త్వరలో థియేటర్లలోకి వస్తోంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.