హ్యాట్సాఫ్ నాగ్... ఈ వయసులో ఆన్ లైన్ క్లాస్ లు

Wed Apr 21 2021 12:00:01 GMT+0530 (IST)

Hatsoff Nag ... Online classes at this age

కింగ్ నాగార్జున సినిమాల పట్ల తాను పోషించే పాత్రల పట్ల ఎంత ఫ్యాషనేట్ గా ఉంటాడో అందరికి తెల్సిందే. ఏ పాత్ర కు కమిట్ అయినా ఆ పాత్రకు తగ్గట్లుగా తన బాడీని మార్చుకోవడంతో పాటు అన్ని విధాలుగా సిద్దం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అద్బుతమైన టేకింగ్ తో పాటు అన్ని విధాలుగా ఆకట్టుకునే విధంగా వైల్డ్ డాగ్ ఉందంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కాని కరోనా కారణంగా వసూళ్ల పరంగా ఆ సినిమా నిరాశ పర్చింది. నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మొదలు అయ్యింది.ప్రవీణ్ సత్తారు సినిమాలో నాగార్జున 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ పాత్ర కోసం నాగార్జున మార్షల్ ఆర్ట్స్ తో పాటు పలు విద్యాలను నేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ను నాగార్జున ఇంట్లో నుండి నేర్చుకుంటున్నాడట. విదేశాల్లో ప్రముఖంగా ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. వాటిల్లో మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన శిక్షణ తీసుకునేందుకు నాగార్జున సిద్దం అయ్యాడు. ఆన్ లైన్ ద్వారా ప్రత్యేక ట్రైనర్ ను పెట్టుకుని మరీ నాగ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం పొందుతున్నట్లుగా ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

నాగార్జున మార్షల్ ఆర్ట్స్ ను ఆన్ లైన్ ద్వారా నేర్చుకుని సినిమాలో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాడట. మొత్తానికి ఈ సినిమా నాగార్జునకు చాలా ప్రతిష్టాత్మకం. అందుకే చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునతో పాటు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటిస్తోంది. ఆమె కూడా రా ఏజెంట్ గానే కనిపించబోతుందట. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ కూడా మార్షల్ ఆర్ట్స్ తో పాటు పలు యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ట్రైనింగ్ ను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్.. గోవా.. ముంబయి ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించబోతున్నారు.