Begin typing your search above and press return to search.

ఒక ఫ్లాప్ చాలు.. రౌడీకి మూడొచ్చాయి!

By:  Tupaki Desk   |   17 Feb 2020 4:50 AM GMT
ఒక ఫ్లాప్ చాలు.. రౌడీకి మూడొచ్చాయి!
X
ఒక్క ఫ్లాప్ చాలు.. నెగెటివ్ ఫోర్సెస్ ఓపెన్ అయిపోతాయి ఇక్క‌డ. గ‌తంలో ఎన్ని హిట్లు ఉన్నా.. ప్ర‌స్తుత ఫ్లాప్ ఒక రేంజులో స‌తాయిస్తుంది. మార్కెట్ వెంట‌నే మ‌రో ఆఫ‌ర్ ఇచ్చేందుకు వెన‌కాడుతుంది. బాక్సాఫీస్ పై సెంటిమెంటు ప్ర‌భావం చాలా ఎక్కువ‌. ఫ్లాప్ డైరెక్ట‌ర్ లేదా ఫ్లాప్ హీరో అన్న ముద్ర వేసి ప‌క్క‌న పెట్టేస్తారు. అయితే ఇటీవ‌ల ద‌ర్శ‌కుల్లో టెక్నికాలిటీస్.. హీరోల్లో పాజిటివ్ క్వాలిటీస్ ని న‌మ్మి మ‌రో ఆఫ‌ర్ ఇస్తున్న వైనం చూస్తున్నాం. కానీ అది కూడా అంద‌రికీ సాధ్యం కాదు.

టాలీవుడ్ రైజింగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా సీన్ ఏమిటి? అన్న‌ది విశ్లేషిస్తే.. అత‌డికి ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఫ్లాపులొచ్చాయి. నోటా -డియ‌ర్ కామ్రేడ్- వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ ప‌రాజ‌యాలు ఊహించ‌నివి. పెద్ద హిట్టు కొట్టేస్తానంటూ దేవ‌ర‌కొండ ఎంతో ధీమాను క‌న‌బ‌రిచిన చిత్రాలివి. అయితే ఊహించ‌ని విధంగా హైప్ పెరిగి బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డిపోవ‌డంతో ఇప్పుడు అది కాస్తా విజ‌య్ కి స‌మ‌స్యాత్మ‌కంగానే మారుతోంది. నోటా- డియ‌ర్ కామ్రేడ్ మ‌ధ్య‌లో టాక్సీవాలా అనే యావ‌రేజ్ మూవీ ఉన్నా అదేమీ ప‌ట్టించుక‌నేంత ప్ర‌భావం చూప‌లేదు.

ఒక్క దెబ్బ‌కే ఫ్లాప్ హీరో అని ముద్ర వేసే ప్ర‌పంచం ఇది. అలాంటిది భారీ హైప్ తో వ‌చ్చిన ఆ మూడు సినిమాలు ఫ్లాపుల‌వ్వ‌డంతో స‌న్నివేశం ఎలా ఉంటుందో ఊహించ‌గలం. గ‌తంలో అర్జున్ రెడ్డి- గీత గోవిందం అనే బ్లాక్ బ‌స్ట‌ర్ ఫోర్సెస్ బ‌లంగా ప‌ని చేశాయి కాబ‌ట్టి రెండు ఫ్లాపులొచ్చినా మూడో సినిమా ఛాన్స్ త‌న‌వైపు వ‌చ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్ ఫ్లాపులను ట్రేడ్ సీరియ‌స్ గానే ప‌రిగ‌ణిస్తోంది. దీని ప్ర‌భావం త‌దుప‌రి ఫైట‌ర్ పై ప‌డినా ఆశ్చర్య‌పోన‌క్క‌ర్లేదు. అయితే ఇస్మార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన పూరి పాజిటివ్ ఫోర్స్ ఫైట‌ర్ కి కొంత‌వ‌ర‌కూ క‌లిసి రావొచ్చేమో! ఫైట‌ర్ చిత్రంతో పాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటే అన్ని నెగెటివ్ ఫోర్సెస్ ని దూరంగా త‌రిమేయొచ్చు. కానీ ఆ ఫీట్ సాధ్య‌మేనా? అంటే దానికి ప్రాక్టిక‌ల్ గా రౌడీ స‌మాధానం ఇవ్వాల్సి ఉంటుంది.