Begin typing your search above and press return to search.

విజయ్ అజిత్ లకు రికార్డులకు చెక్ పెడతాడా?

By:  Tupaki Desk   |   10 Jan 2019 7:54 AM GMT
విజయ్ అజిత్ లకు రికార్డులకు చెక్ పెడతాడా?
X
తమిళంలో నెంబర్ 1 ఎవరంటే రజనీ పేరే చెప్తారు గానీ ఈమధ్య మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. అప్పట్లో తమిళనాట అన్నీ రికార్డులు రజనీకాంత్ సినిమాల పేరిట ఉండేవి కాబట్టి రజనీ తర్వాతే ఇతర హీరోలను చెప్పుకునేవారు. కానీ గత కొన్నేళ్లుగా విజయ్.. అజిత్ లు భారీ కలెక్షన్స్ తో రికార్డులన్నీ తమ పేరిట రాసుకోవడంలో పోటీ పడుతున్నారు. ఈ పోటీలో అజిత్ కంటే కాస్త ముందు విజయ్ ఉన్నాడు గానీ రజనీ మాత్రం వెనకబడ్డాడు.

'మెర్సల్'.. 'సర్కార్' లాంటి సినిమాలతో దాదాపు రజనీ రికార్డులను చెరిపేశాడు విజయ్. రజనీ లాస్ట్ '2.0' కూడా తమిళ నాట విజయ్ రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే పొంగల్ సీజన్ సందర్భంగా ఈరోజు రజనీ 'పెట్టా'.. అజిత్ 'విశ్వాసం' పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి. కనీసం ఈ సినిమాతో అయినా రజినీ భారీ వసూళ్ళు సాధించి విజయ్.. అజిత్ రికార్డులను బ్రేక్ చేస్తాడా అనే చర్చ సాగుతోంది. కనీసం అజిత్ 'విశ్వాసం' కంటే తన సినిమా 'పేట' తో ఎక్కువ కలెక్షన్స్ సాధించగలడా అనే చర్చలు కోలీవుడ్ లో సాగుతున్నాయి.

'పేట' తో కనుక తన బాక్స్ ఆఫీస్ స్టామినాను రజనీ కనుక మరోసారి నిరూపించుకోలేకపోతే రేసులో విజయ్ అజిత్ లు సూపర్ స్టార్ కంటే ముందుకు దూసుకుపోతారు. అదే జరిగితే సీనియారిటీ.. ఫ్యాన్ బేస్ లాంటివాటిలో రజనీ నంబర్ వన్ అయినా.. కలెక్షన్స్ విషయం వచ్చేసరికి రెండు లేదా మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే.