హరీష్ శంకర్ కు పవన్ కొత్త బాధ్యతలిచ్చాడా?

Sat Dec 03 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Has Pawan given a new responsibility to Harish Shankar?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల్లో యాక్టీవ్ గా వుంటున్నారు. ఏపీలో ఏం జరిగినా వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీ క్యాడర్ ని సిద్ధం చేసుకునే క్రమంలో ఏపీలో పర్యటిస్తూ తన పార్టీ ఉనికి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ కారణంగా పవన్ నటిస్తున్న కమిట్ అయిన సినిమాలు నెలల తరబడి ఆలస్యం అవుతూ వస్తున్నాయి.పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ ఫిక్షనల్ మూవీ 'హరి హర వీరమల్లు'లో నటిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ పవన్ కల్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా ఆగుతూ సాగుతూ వస్తోంది. కరోరాకు ముందు సెట్స్ పైకి వెళ్లిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో నిర్మాత దర్శకుడు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ మూవీ తాజా షెడ్యూల్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవలే మొదలు పెట్టారు.

పవన్ తో పాటు 900 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనగా పలు కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ ఎప్పుడు టైమ్ ఇస్తే అప్పుడు షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత పవన్ అంగీకరించిన మూవీ 'భవదీయుడు భగత్ సింగ్'. హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ మూవీని అత్యంత భారీగా నిర్మించాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రకటించి కూడా దాదాపు రెండేళ్లు కావస్తోంది.

ఇంత వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఫస్ట్ లుక్ టైటిల్ ని విడుదల చేసిన చిత్ర బృందం దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ఎప్పుడు సిగ్నల్ ఇస్తాడా? అని గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం 'భవదీయుడు భగత్ సింగ్'ని పక్కన పెట్టి 'తేరీ' రీమేక్ పై వర్క్ చేయమని పవన్ హరీష్ శంకర్ తో చెప్పిపనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

హరీష్ శంకర్ కు ప్రస్తుతం పవన్ చెప్పిన పని చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. దీంతో తను చెప్పినట్టే 'తేరీ' స్క్రిప్ట్ లో పవన్ కు తగ్గట్టుగా మార్పులకు శ్రీకారం చుట్టినట్టుగా చెబుతున్నారు. ఛేంజెస్ పూర్తయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పూజ.. సెకండ్ వీక్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీని డీవీవీ దానయ్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.