హీరోయిన్ తో రొమాన్స్ గౌతమ్ మీనన్ బోర్డర్ దాటాడా?

Tue Aug 09 2022 12:21:39 GMT+0530 (IST)

Has Gautham Menon's romance Scene with heroine crossed the border?

గౌతమ్ వాసుదేవ్ మీనన్ లవ్ స్టోరీలు తెరపై చూడటానికి ఎంత అందంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ అలాంటి ఎన్నో ప్రేమకథలు తెరకెక్కించారు. కొన్ని యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేసినా? వాటిలోనూ గౌతమ్ మార్క్ లవ్ స్టోరీ ఒకటుంటుంది. ఆయన సినిమాల్లో రొమాన్స్ కి అంతే ప్రాధాన్యత ఉంటుంది.సన్నివేశం డిమాండ్ మేరకు పెదవి ముద్దులు..విరహాగీతాలు తప్పనిసరి. ఆ రొమాన్స్ ని కూడా తెరపై ఎంతో అందంగా మలచడం గౌమత్ మీనన్  ప్రత్యేకత. మాధవన్ నుంచి  నాగచైతన్య వరకూ లవర్ బోయ్ ఇమేజ్ లు రావడానికి కారణం కేవలం గౌతమ్ మీనన్ సినిమాలే. ఇంకా మరెంతో మంది హీరోలకు ఆ ఇమేజ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.

మరి గౌతమ్ మీనన్ తాజా చిత్రంలో రొమాన్స్ విషయంలో హద్దు మీరుతున్నారా? అందంగా మలిచే రొమాన్స్ లో బోర్డర్ దాటుతున్నారా?  అంటే అవుననే ప్రచారం కోలీవుడ్  మీడియాలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం శింబు హీరోగా గౌతమ్ మీనన్ 'వెందు తనిందతు కాదు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో 'జంపలకడిపంబ' భామ సిద్ది ఇద్నానీ హీరోయిన్ గా నటిస్తోంది.

తమిళ్ లో అమ్మడికి ఇదే తొలి సినిమా. గౌతమ్ మీనన్ సినిమాలో ఛాన్స్ అనే సరికి ఎగిరి గంతేసింది. ఇటీవలే చిత్రీకరణ కూడా ముగిసింది. ఇందులో సిద్ది పావై అనే పాత్రలో నటిస్తోంది. అయితే సినిమాలో కొన్ని రొమాంటిక్  సన్నివేశాలు డిమాండ్ చేసే సరికి గౌతమ్ మీనన్ తన ఫరిది దాటి ఆ సన్నివేశాలు షూట్ చేసినట్లు కోడం బాక్కం వర్గాలు అంటున్నాయి.

శింబు-సిద్ది మధ్య పెదవి ముద్దు సన్నివేశాలు సహా కొన్ని బెడ్ రూమ్ ఇంటిమేట్ సన్నివేశాలున్నాయని ప్రచారం సాగుతోంది. వాటి చిత్రీకరణ కేవలం నలుగురు మధ్య ఓ డార్క్ రూమ్  బ్లూలైట్ లో షూట్ చేసారుట. ఈ సన్నివేశాలు తెరపై ఇలా వచ్చి అలా కనిపించి వెళ్లిపోయేవి  కాదని సన్నివేశం డిమాండ్ చేయడంతో వాటిని రక్తికట్టించుకోడం కోసం థియేటర్లో అదే తీరున హైలైట్ చేయబోతున్నట్లు సమాచారం.

హీరోయిన్లతో ఇలాంటి సన్నివేశాల్లో నటించడం శింబుకి కొత్తేం కాదు. దాదాపు ఆయన హీరోగా నటించిన సినిమాల్లో హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు పీక్స్ లో నే ఉంటాయి. కాకపోతే ఈసారి వాటికి గౌతమ్ మీనన్ క్రియేటివిటీ తోడైంది. తెరపై మరింత రసవత్తరంగా  కనిపించనున్నాయి.  ఇక  సినిమాలో నటించడం పట్ల హీరోయిన్   ఎంతో ఎగ్జైట్ మెంట్ కి గురవుతుంది.

గౌతమ్ మీనన్  సినిమాలో నటించానంటే?  ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అంటోంది. అలాగే తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుందిట. ఇది గౌతమ్ మీనన్ కల్పించిన గొప్ప అవకాశంగా చెప్పుకొచ్చింది.