బంగారు ఆభరణాలంటే ఇష్టపడని ఏకైక స్టార్ హీరో

Sat Oct 17 2020 10:00:07 GMT+0530 (IST)

The only star hero who dont loves gold jewelry

స్టైలిష్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్ బిరుదాంకితుడు. వెండితెరపైనే కాక రెగ్యులర్ లైఫ్ లోనూ అదే స్టైల్ ని మెయింటైన్ చేస్తూ స్టైలిష్ హీరో అనిపించుకుంటున్నారు. అలా ఆయనని తీర్చిదిద్దడంలో.. మెయింటైన్ చేయడంలో స్టైలిస్ట్ హర్మన్ కౌర్ కి పెద్ద సవాల్ గా మారిందట. ఆ మధ్య బన్నీ స్టైల్ సీక్రెట్ లని పంచుకున్న హర్మాన్ కౌర్ తాజాగా మరిన్ని సీక్రెట్ లని బయట పెట్టింది.బన్నీ స్టైల్స్ విషయంలో చెప్పుకోదగిన విషయం ఏంటంటే అతను గోల్డ్ ధరించకపోవడమేనని ఇంతకుముందే హార్మాన్ వెల్లడించారు. చాలా మంది స్టార్స్ స్టైలిష్ గా కనిపించడానికి మెడలో లేదా చేతి మణికట్టుకి బ్రాస్ లెట్ ల రూపంలో స్టైల్ గా ధరిస్తూ వుంటారు కానీ బన్నీ మాత్రం అలాంటి గోల్డ్ యాక్సెసరీస్ ధరించడానికి ఆసక్తిని చూపించడు. బన్నీ స్టైలిష్ గా కనిపిస్తూనే సింపుల్గా వుండే వాటిని ధరించడానికి ఇష్టపడుతుంటారట. అందుకే అతన్ని హర్మాన్ కౌర్ ‘ఎడ్జీ.. మినిమల్ అండ్ కూల్’ అని పిలుస్తుంటుందట.

బాలీవుడ్ కు చెందిన హర్మాన్ కౌర్ స్టైలిస్ట్ గా సౌత్ హీరో బన్నీతో కెరీర్ స్టార్ట్ చేసినా ఆమెకు బాలీవుడ్ స్టార్స్ నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కారణం బన్నీ స్టైల్స్ ని వారు కూడా ఇష్టపడటమే. బన్నీతో పాటు హర్మాన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కూడా స్టైలిస్ట్ గా వర్క్ చేస్తోంది. బన్నీతో పోలిస్తే విజయ్ డిఫరెంట్ అని చాలా చూసీగా వుంటారని స్టైల్ విషయంలో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతుంటారని చెప్పింది.