'బిగ్ బాస్' బ్యూటీ సొంతింటి కల నెరవేరెను

Wed Sep 11 2019 13:31:09 GMT+0530 (IST)

Hariteja New House

బిగ్ బాస్ సహా టీవీ షోలు.. సినిమాలతో సుపరిచితురాలైన నటి హరితేజ డ్రీమ్ ఏంటో తెలుసా? ఏదో ఒకరోజు అదిరిపోయే లొకేషన్ లో సౌకర్యవంతమైన సొంతింటి కలను సాకారం చేసుకోవడం. ఎట్టకేలకు అది నిజమైంది. నేడు కొత్త ఇంట్లోకి భర్తతో కలిసి అడుగు పెట్టింది. ఈ విషయాన్ని తనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.ఇంత కాలానికి తాను కన్న కలని నిజం చేసుకున్నానని తన భర్తతో కలిసి కొత్త ఇంటిలోకి ప్రవేశిస్తున్న ఫొటోని ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసిన హరితేజ ఆసక్తికరమైన పోస్ట్ ని పెట్టింది. ``ఎన్నో ఏళ్ల నా కలని ఇప్పుడే నిజం చేసుకున్నాను. దీని వెనక ఎంతో ప్రేమ..  కఠోరమైన శ్రమ.. సాధించాలన్న పాషన్.. సాధిస్తాననే బలమైన నమ్మకం దాగివున్నాయి`` అంటూ హరితేజ ఎమోషన్ అయ్యింది.

ఫైనల్ గా నేను.. నా భర్త కోరుకున్న డ్రీమ్ హోమ్ ని సొంతం చేసుకున్నాం. దీన్ని సాధించడం వెనక ఎన్ని కష్టాలున్నాయో నాకు తెలుసు. ఈ స్థాయికి నేను చేరుకోవడానికి ఎంత మంది సపోర్ట్ గా నిలిచారో.. ఎంత మంది తమ సహాయ సహకారాల్ని అందించారో అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఎదుగుదలకు కారణమైన వారితో నా ఆనందాన్ని పంచుకోవడానికే ఈ ఫొటోని షేర్ చేస్తున్నాను. అని తెలిపింది హరితేజ. ఈ వేడుక కోసం శారీని పీచ్ డిజైనింగ్ బోటిక్ వారు డిజైన్ చేశారని.. జువెల్లరీని శభరీస్.. అండ్ విభ క్రియేషన్ కలెక్షన్స్.. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ ని `ఫెయిరీస్ అండ్ బ్రైడ్స్` వంటి క్రేజీ సంస్థలు చేశాయని వివరించింది.