Begin typing your search above and press return to search.

తల్లి కాబోతున్న యాంకర్​ హరితేజ..!

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:09 AM GMT
తల్లి కాబోతున్న యాంకర్​ హరితేజ..!
X
బిగ్​బాస్​ ఫేమ్​, ప్రముఖనటి, యాంకర్​ హరితేజ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని ఇన్​స్టాలో వీడియో పోస్ట్​చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. పలువురు నెట్​జన్లు ఆమెకు కంగ్రాట్స్​ చెబుతున్నారు.

ఇటీవల లాక్​ డౌన్​ లో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. బిగ్​ బాస్​ హౌస్​ ద్వారా హరితేజ ఎంతో పాపులర్​ అయ్యారు. అంతకుముందు కూడా ఆమె పలు సీరియళ్లు, కార్యక్రమాలు చేసి తనకంటూ ఓ ఇమేజ్​ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్​ కార్యక్రమం తర్వాత ఆమెకు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. ‘అఆ’ సినిమాలోని పనిమనిషి పాత్ర ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. స్టార్ మా, జెమినీ, ఈటీవీ లాంటి చానల్స్ ​లో ఆమె ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు. బిగ్​బాస్​ సీజన్​ 1లో హరితేజ ఎంతో అలరించారు. ఆమె ఫైనల్​ రౌండ్​ దాకా హౌజ్ లో కొనసాగారు. హరితేజ విజేతగా నిలుస్తారని అంతా భావించారు.

కానీ చివరినిమిషంలో అభిమానుల ఓటింగ్​, ముఖ్యంగా ఓ ప్రముఖహీరో అభిమానులు కట్టగట్టుకొని మరో సభ్యుడిగా ఓట్లు వేశారు. దీంతో ఆమె టైటిల్​ విజేతగా నిలవలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ఆమె బిగ్​బాస్​ హౌస్​కు వెళ్లాక ఎంతో పాపులారిటీ సంపాదించింది. ఎందరో అభిమానులను తయారు చేసుకున్నది. బిగ్​ బాస్​ హౌస్​ లో ఆమె చెప్పిన బుర్రకథ ప్రేక్షకులను ఎంతో అలరించింది. హరితేజ లో ఈ ట్యాలెంట్​ కూడా ఉందా? అంటూ పలువురు ఆమెను మెచ్చుకున్నారు.

ఆ తర్వాత ఆమెకు కొంతకాలం పాటు సినిమా చాన్స్​లుకూడా బాగానే వచ్చాయి. కానీ కరోనా లాక్​డౌన్​తో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్​లో ఆమె నటించడం లేదు. అయితే హరితేజ తల్లి కాబోతుండటం తో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.