రామ్ మాస్ ప్లాన్.. లైన్ లోకి పవన్ డైరెక్టర్?

Tue May 24 2022 13:00:02 GMT+0530 (IST)

Harish shankar on ram pothineni

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చేసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేసిన అనంతరం ఈ హీరో తన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత చేయబోయే సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని సిద్ధమవుతున్నాడు.ఆ మధ్య చేసిన రెడ్ సినిమా రామ్ ఊహించనంతగా సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం తమిళ సీనియర్ దర్శకుడితో ది వారియర్ అనే సినిమా చేస్తున్న రామ్ ఆ సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ది వారియర్ సినిమా పై చాలా నమ్మకంతో ఉన్న రామ్ పోతినేని ఆ తర్వాత ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్ కమర్షియల్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం దర్శకుడు బోయపాటి రామ్ పోతినేని కోసం ఫైనల్ స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అదే విధంగా మరో మాస్ దర్శకుడితో కూడా చర్చలు జరుపుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి విజయం తర్వాత భవదియుడు భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న హరీష్ శంకర్ అని తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

అక్కడ సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చాలా బిజీగా ఉండడంతో ప్రాజెక్టు సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది.

ఇక ఇంతలోపు భవదియుడు భగత్ సినిమాలు పూర్తి చేసుకుని హరీష్ శంకర్ రామ్ పోతినేనితో ఒక బిగ్ బడ్జెట్ సినిమాను తెరపైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదివరకే రెండు మూడు సార్లు వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.