Begin typing your search above and press return to search.

హ‌రీష్ శంక‌ర్ పంచ్ అదిరింది!

By:  Tupaki Desk   |   23 Jan 2023 3:23 PM GMT
హ‌రీష్ శంక‌ర్ పంచ్ అదిరింది!
X
క‌రోనా పుణ్య‌మా అని ఓటీటీల‌కు దేశ వ్యాప్తంగా భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రావ‌డం కంటే ఇంట్లో కూర్చునే ఇంటిల్లి పాదికి సినిమా చూపించేస్తున్నారు. దీంతో ఓటీటీల‌కు మునుపెన్న‌డూ లేనంత‌గా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో చాలా మంది పేరున్న ద‌ర్శ‌కులు కూడా సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి ప్ర‌ముఖ ఓటీటీల‌కు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. భారీ స్థాయిలో కంటెంట్ ని జ‌న‌రేట్ చేస్తున్నారు.

అయితే ఇది ఉత్త‌రాది ద‌ర్శ‌కులు మాత్ర‌మే ప‌రిమితం అవుతోంది. కార‌ణం ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌లో వుండే కంటెంట్ హెడ్ లు. ప్ర‌తీ ఓటీటీలోనూ వీరిదే ఆధిప‌త్యం.. వీరికి కంటెంట్ పై క‌నీస అవ‌గాహ‌న వుండ‌దు.. దేన్ని సెలెక్ట్ చేయాలో కూడా తెలియ‌దు. కానీ ఎలాంటి నాలెడ్జ్ లేకుండానే ప్ర‌ముఖ ఓటీటీల్లో కంటెండ్ హెడ్ లుగా చ‌ల‌మ‌ణీ అవుతున్నారనే విమ‌ర్శ‌లు గ‌త కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఆ కార‌ణంగానే తెలుగు ద‌ర్శ‌కులు ఓటీటీల వైపు తొంగి చూడ‌టం లేద‌ని తెలుస్తోంది.

తెలుగు ద‌ర్శ‌కుల్లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి, నాగ్ అశ్విన్‌, త‌రుణ్ భాస్క‌ర్ వంటి ద‌ర్శ‌కులు ఓటీటీల‌కు వెబ్‌సిరీస్ ల‌ని అందించారు. కానీ ఉత్త‌రాది వారి త‌ర‌హాలో మాత్రం స‌క్సెస్ కాలేక‌పోయారు. మ‌ళ్లీ అటు వైపు అడుగులు వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు కూడా. కార‌ణం ఏంటంటే ఓ ద‌ర్శ‌కుడు క‌థ చెప్పాల‌న్నా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆఫీసుల్లో గంట‌ల త‌ర‌బ‌డి ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి. అది చాలా మంది పేరున్న ద‌ర్శ‌కుల‌కు చిరాకు తెప్పిస్తోంద‌ట‌.

ఆ కార‌ణంగానే స్టార్ డైరెక్ట‌ర్స్ ఓటీటీల్లో క్రేజీ వెబ్ సిరీస్ లు చేయాల‌ని వున్నా గంట‌ల త‌ర‌బ‌డి వేయిట్ చేయ‌లేక అటు వైపు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంలో కంటెంట్ హెడ్ ల ప్ర‌వ‌ర్త‌న‌, వారు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తాజాగా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

డైరెక్ట్ గా ఓటీటీ కంటెంట్ హెడ్ ల‌నే టార్గెట్ చేస్తూ హ‌రీష్ శంక‌ర్ తూటాలు పేల్చ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓటీటీల్లో కంటెంట్ హెడ్ లు అని పిల‌వ‌బ‌డే వారు త‌మ హోదాని ఎంజాయ్ చేస్తున్నారు.

కానీ వారి ప‌నిని మాత్రం ఎంజాయ్ చేయ‌డం లేదు. ఎంత పెద్ద డైరెక్ట‌ర్ అయినా వాళ్ల ఆఫీసుకి వెళ్లి గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించాల్సిందే. సినిమా అంటే ప్యాష‌న్ వున్న వాళ్లం. దాని కోసం ఎన్ని గంట‌లైనా వేచి చూస్తాం. కానీ ఓటీటీ కంటెంట్ హెడ్ లు త‌మ ప‌ద్ద‌తుల్ని మార్చుకోవాలి' అని ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. అంతే కాకుండా ఓటీటీల‌లో సిరీస్ లు చేయ‌డం వ‌ల్ల మాకు పెద్ద‌గా ల‌భించే మొత్తం అంటూ ఏమీ లేద‌ని, అయితే ఇందులో క్రియేటివ్ ప‌రంగా లిమిటేష‌న్స్ వుండ‌వ‌ని, ఆ కార‌ణంగానే ఓటీటీల్లో సిరీస్ లు చేయాల‌నుకుంటున్నాన‌ని హ‌రీష్ శంక‌ర్ తెలిపారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.