Begin typing your search above and press return to search.

సాయం చేయబోయి విమర్శ ఎదుర్కొన్న డైరెక్టర్!!

By:  Tupaki Desk   |   15 July 2020 5:30 PM GMT
సాయం చేయబోయి విమర్శ ఎదుర్కొన్న డైరెక్టర్!!
X
ఈ మధ్య సినీ సెలబ్రిటీలకు నెటిజన్ల నుండి భారీ షాకులే ఎదురవుతున్నాయి. వారు మంచి విషయం గురించి మాట్లాడితే ఎన్నడూ లేనిది ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు.. అంటారు. అదే ఒక విషయం పై స్పందించకపోతే సెలబ్రిటీ అయి స్పందించరు.. అని ఆ నెటిజన్లే విమర్శలు గుప్పిస్తారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి డైరెక్టర్ హరీష్ శంకర్ ఎదుర్కొన్నాడు. ఆయన తాజాగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయనను కాపాడే ప్రయత్నం ట్విట్టర్ ద్వారా చేశాడు. అయితే హరీష్ ఆ పెద్దాయనకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ ట్వీట్ చేసాడు. ఇది గ్రహించని ఓ ఆకతాయి హరీష్ కు పంచ్ డైలాగుతో షాక్ ఇచ్చాడు. దానికి హరీష్ స్పందించి వీడిని ఏమి అనాలో తెలియడం లేదని పోస్ట్ చేసాడు. వాస్తవానికి హైదరాబాద్ నగరంలోని మలక్ పేట్ సమీపంలో 70 ఏళ్లు పైబడిన వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు.

దగ్గరలోని యశోద హాస్పటల్ వాళ్లు స్పందించి అంబులెన్స్ పంపి ఆ వ్యక్తిని కాపాడాలని ట్విట్టర్ ద్వారా హాస్పిటల్ సిబ్బందిని కోరాడు హరీష్ శంకర్. అయితే హరీష్ ఈ విషయం ఎందుకు.. ఎవరికి సాయం చేయడానికి అనే విషయాలు పక్కన పెట్టేసి.. వెంకీ(వెంకటేష్) అనే నెటిజన్ ఇలా ట్వీట్ చేసాడు. ‘బుర్ర ఉంది కదా.. కొంచెం వాడు, ట్వీట్ చేసేకంటే అంబులెన్స్‌కి నువ్వే కాల్ చేయొచ్చు కదా.. నువ్ ట్వీట్ చేసేలోపు పేషెంట్ కి ఏమైనా అయితే" అంటూ పబ్లిసిటీ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేసాడు. ఆ నెటిజన్ స్పందన చూసిన హరీష్ శంకర్.. అసలు వీడిని ఏమనాలో తెలియట్లేదు.. అంటూ రీట్వీట్ చేసాడు. ఇక అక్కడ అసలు సంగతి వదిలేసి ఉచిత సలహాలు ఇచ్చిన నెటిజన్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయం చేద్దాం అనుకున్న వ్యక్తితో అలా ఎలా మాట్లాడతావ్ అని అంటున్నారు. ఈ విషయం పై హరీష్ శంకర్ కి నెటిజన్ల నుండి మద్దతు లభిస్తుంది.