హరీష్ సూక్తులతో మూర్ఖులకు కనువిప్పు!

Sat Sep 21 2019 09:54:16 GMT+0530 (IST)

Harish Shankar Speech at Valmiki Movie Success Meet

సినిమావోళ్లు అంటేనే చులకన. వీళ్లేదో అంతరిక్షం నుంచి ఊడిపడినట్టు చూస్తుంటారు ఇతర జనం. కాకుల్లా పొడుచుకు తింటారు కొందరైతే. కృష్ణానగర్ - ఫిలింనగర్ లో అద్దె గది కూడా దొరకదు సినిమా బ్యాచిలర్స్ అంటే! అలాంటి ధైన్యం ఉన్న వీళ్లకు ఎవరో ఒకరు సపోర్టుగా ఉండాలి కదా!  కాస్త అటూ ఇటూగా అయినా సినిమా వాళ్లందరి తరపునా వకాల్తా పుచ్చుకోను అంటూనే తన నెత్తిన వేసుకున్నారు ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్.సినిమా వాళ్లపై విమర్శలు పెరిగాయ్.. రకరకాల సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం అంటూ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసిన హరీష్ అసలు తప్పు పరిశ్రమది కాదు... ఇందులో కొందరి వల్ల అలా అనిపిస్తుంటుంది. తప్పు మనుషుల్లో ఉంటుంది .. ఇనిస్టిట్యూషన్ లో ఉండదు! అని ఓ రేంజులోనే క్లాస్ తీస్కున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు  అయినా ఆటో డ్రైవర్లు అయినా బాగా ఉండేవాడు ఉంటాడు కానీ ఉండని వాడు ఉండడు అని అన్నారు. సినిమా వాళ్లపై నిందలు ఈమధ్య రెగ్యులర్ గా చూస్తున్నానని అన్నారు. తప్పుడు మనుషులు ఏ పరిశ్రమలో అయినా ఉండొచ్చునని అభిప్రాయ పడ్డారు. మొత్తం సినిమావోల్లందరి తరపునా వకాల్తా పుచ్చుకోను. కమర్షియల్ సినిమాలు తీసేప్పుడైనా మంచి విషయం చెప్పండి అని పెద్దలు చెప్పిన సందర్భాలున్నాయి. వాల్మీకి (గద్దలకొండ గణేష్) చిత్రంలో అధర్వ పాత్ర చెప్పింది అదే. సినిమా ఇండస్ట్రీలో టీ దొరకాలన్నా రాసిపెట్టి ఉండాలి.. అనే డైలాగ్ అలా పుట్టుకొచ్చిందే.

సినిమా గొప్పది.. అది గద్దల కొండ లాంటి ఈగోయిస్ట్ ఈగోనే మార్చింది. సెట్స్ లో పని చేసే టెక్నీషియన్ల మధ్యనో లేదా ఆర్టిస్టులతోనో అప్పుడప్పుడు అపార్థాలు వస్తుంటాయి. వాటిని కూడా సినిమానే పోగొడుతుంది అని లైట్ గా తనకు తెలీకుండానే క్లాస్ తీస్కున్నాడు హరీష్. బయటి జీవితంలో కాంప్రమైజ్ లేక ఇండస్ట్రీలోకి వచ్చాను.. ఇలాంటి డైలాగులకు జనాల నుంచి మంచి స్పందన వచ్చిందని.. కాంప్రమైజ్ కి అడ్జస్ట్ అవ్వడానికి తేడా చెప్పడం అందరికీ నచ్చిందని అన్నారు. గద్దల కొండ గణేష్ సక్సెస్ మీట్ లో ఆయన ఈ మాటలన్నారు. పాజిటివ్ బజ్ ఉన్నప్పుడు హరీష్ ఏం చెప్పినా వినేవాళ్లే ఉంటారు! ఫెయిలైనప్పుడే పట్టించుకోరు సుమీ!!