ఏ పండుతో ఏ హీరోయిన్ ను కొట్టాలో ఆయనకి తెలుసు: హరీశ్ శంకర్

Mon Aug 15 2022 09:20:31 GMT+0530 (IST)

Harish Shankar On Raghavendra Rao

రాఘవేంద్రరావు సమర్పకుడిగా  .. శ్రీధర్ సీపాన దర్శకత్వంలో  'వాంటెడ్ పండుగాడ్ ' సినిమా రూపొందింది. సునీల్ .. బ్రహ్మానందం .. శ్రీనివాస రెడ్డి .. వెన్నెల కిశోర్ .. సప్తగిరి .. షకలక శంకర్ .. సుధీర్ ..  అనసూయ .. దీపిక పిల్లి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీశ్ శంకర్ మాట్లాడుతూ ..
"ఏ ఇండస్ట్రీలో లేనంతమంది కమెడియన్స్ మన తెలుగులో ఉన్నారు. ఎమ్మెస్ .. ధర్మవరపు .. ఏవీఎస్ వంటివారిని కోల్పోయినప్పుడు వెలితి వచ్చిందేమో అనిపించింది.కానీ ఈ రోజున ఇక్కడ కమెడియన్స్ పోస్టర్  చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవడం లేదు. సునీల్ .. వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి ఇలా అంతా కూడా ఆ లెగస్సీని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కమెడియన్స్ ఎక్కువమంది ఉన్నారనే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నారు.

అందుకు వాళ్లందరి పట్ల నాకు గౌరవం ఉంది .. ఆ తరువాత ఇష్టం ఉంది. రాఘవేంద్రరావుగారికి ఎన్నేళ్లు వచ్చినా  ఆయన పండ్లను వదలరనడానికి ఈ టైటిల్ ఒక నిదర్శనం. ఆయనకి పండ్లే దేవుడు గనుక 'పండుగాడ్' అని పెట్టారు.

రాఘవేంద్రరావు గారికి ఏ హీరోయిన్ ను ఏ పండుతో కొట్టాలనేది బాగా తెలుసు. పాండమిక్ లో 60 దాటిన వాళ్లు  బయటికి రాకూడదని అంటే .. రాఘవేంద్రరావుగారు మాత్రం రెండు సినిమాలు చేసేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన స్పీడ్ మాకు ప్రేరణ.

ఇక కోవెలమూడి సాయిబాబాగారి ఇంటిపేరు చూసి మేమంతా కూడా రాఘవేంద్రరావుగారికి ఎంత  దగ్గరి బంధువులేమోనని అనుకున్నాము. కానీ ఇంటిపేరుతో సంబంధం లేకుండా ఆయన రాఘవేంద్రరావు గారికి ఎంత క్లోజ్ అనేది తరువాత అర్థమైంది.

సునీల్ తో పాటు మిగతా ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలో వాళ్లు ఇరగదీశారని అనుకుంటున్నాను. సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను. ఏ సినిమా ట్యాగ్కో లైన్ 'పట్టుకుంటే కోటి'. కానీ ఈ సినిమా కోట్ల రూపాయలను వసూలు చేయాలని ఆశిస్తున్నాను. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో చూడండి" అంటూ చెప్పుకొచ్చాడు.