ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ తో రూమర్ లకు చెక్ పెట్టేశారు!

Fri Sep 30 2022 19:08:21 GMT+0530 (India Standard Time)

Hari Hara Veera Mallu Team Starts A Pre Schedule Workshop

పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం.. మరో నిర్మాత ఏ. దయాకర్ రావుతో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్య కాలం నాటి కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బందిపోటు దొంగగా కనిపించనున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులని అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయబోతున్నారు.  అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం చిత్ర బృందం శక్తి వంచన లేకుండా శ్రమిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్ విషయంలో పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వాటన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర బృందం శుక్రవారం తదుపరి షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కు సంబంధించిన వీడియోని విడుదల చేసి క్లారిటీ ఇచ్చేసింది. తదుపరి షెడ్యూల్ లో పాల్గొనే ప్రధాన నటీనటులతో పాటు కొంత మంది సాంకేతిక నిపుణులతో ప్రీ షెడ్యూట్ వర్క్ షాప్ ని నిర్వహించారు.

మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడంతో నటీనటులు సాంకేతిక నిపుణులు వర్క్ షాప్ లో పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఉదయం ఝామున సరస్వతీ అమ్మవారికి పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం చిత్ర బృందం ఈ వర్క్ షాప్ ని నిర్వహించారట. ఈ వర్క్ షాప్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లుక్ తొలి ప్రేమ నాటి రోజుల్ని గుర్తు చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త లుక్ టెర్రిఫిక్ గా ఉంది.
మళ్లీ అంత యంగ్ గా పవన్ ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆయన లుక్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ వర్క్ షాప్ లో పవన్ దర్శకుడు క్రిష్ తదుపరి షెడ్యూల్ గురించి క్షణ్ణంగా చర్చించారు. పెద్ద స్టార్ అయినా పవన్ తన తొటి నటీనటుల పాత్రల గురించి షూటింగ్ ముందు తెలుసుకునే క్రమంలో వర్క్ షాప్ లో పాల్గొనడం విశేషం. ఈ ప్రీ వర్క్ షాప్ లో పవన్ కల్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ సునీల్ సుబ్బరాజు రఘు బాబు హైపర్ ఆది పాల్గొనగా సాంకేతిక వర్గం నుంచి సంగీత దర్శకుడు కీరవాణి నిర్మాతలు ఏ.ఎం. రత్నం ఏ. దయాకర్ రావు సినిమాటోగ్రాఫర్ వి.ఎస్. జ్ఞానశేఖర్ విజయ్ అడారియా తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ రెండవ వారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.