Begin typing your search above and press return to search.

బికినీలో పాండే బ్యూటీ ప‌రేషాన్ చేస్తుందే!

By:  Tupaki Desk   |   19 Aug 2022 1:30 PM GMT
బికినీలో పాండే బ్యూటీ ప‌రేషాన్ చేస్తుందే!
X
ప్ర‌స్తుతం భార‌త్ టీమ్ జింబాంబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి కొంత మంది ఆట‌గాళ్ల‌కి బోర్డ్ విశ్రాంతి క‌ల్పించింది. ఇందులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. సెల‌వు దొరికిందే త‌డ‌వ! పాండ్య భార్య‌తో క‌లిసి వెకేష‌న్ కి చెక్కిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌న ఆల్ రౌండ‌ర్ భార్య నటాషా.. కుమారుడు అగ‌స్త్య‌ కలిసి హాలీడేను ఎంజాయ్ చేస్తున్నాడు.

వారం కింద‌ట‌ శాంటోరిని దీవిలో దంప‌తులు ఎంజాయ్ చేసారు. స్పాట్ నుంచి కొన్ని సెల్పీలు అభిమానుల‌కు షేర్ చేసాడు. బీచ్ అందాల్ని ఆస్వాదిస్తూ.. ఇద్ద‌రు చిట్టిపొట్టి దుస్తుల్లో ఇన్ స్టా లో మంట‌లు రేపారు. తాజాగా న‌టాషా బికీనీ ట్రీట్ నెట్టింట కాక‌లు పుట్టిస్తోంది. గ్రీస్ దేశంలో ఎండ‌లు మండిపోతుండటంతో పూల్ లో అమ్మడు ఇలా బికినీ..మోనోకీలో సేద తీరుతుంది.

తెలుపు..న‌లుపు చార‌ల స్విమ్ షూట్ లో అందాల విందు చేసింది. ఎండ తీవ్ర‌త ముఖంపై ప‌డ‌కుండా హ్యాట్ తో క‌వ‌ర్ చేసింది. నెక్ పై ఏసు క్రీస్తు సిలువుతో కూడిన చైన్ మెడ‌ని మ‌రింత అందంగా మ‌లిచింది. మ‌రో ఫోటో లో ఈత చెట్టుకింద జారుకుంటున్న బికినీని స‌రిచేసుకుంటూ క‌నిపించింది. బికినీలో అమ్మ‌డి త‌డిపొడి అందాలు యువ‌త‌లో అగ్గిరాజేస్తున్నాయి.

ఈ సొగ‌సైన బికినీ గురించి కొన్ని కామెంట్లు సైతం పోస్ట్ చేసింది. నా శ‌రీరానికి బికినీ అవ‌స‌రం అనుకుంటే? అందుకు ఎస్ అనే స‌మాధానం వ‌స్తుంద‌ని అంటుంది. గ్రీస్ దేశ‌పు జాతీయ జెండాని..స‌ముద్రం కెర‌టాన్ని.. ఓ ల‌వ్ సింబ‌ల్ ఎమోజీని సైతం జోడించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.

హార్దిక్ పాండ్యా కంటే రెండేళ్లు పెద్దదైన నటాషా.. సెర్బియా దేశస్తురాలు. నటనలో మెలకువలు నేర్చేందుకు 2012లో ఇండియాకు వచ్చింది. కొన్ని ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా పనిచేసింది. 2014లో వచ్చిన 'సత్యాగ్రహ' చిత్రంతో బాలీవుడ్ వెండితెరపై మెరిసింది. హిందీ బిగ్బాస్ -8 సీజన్లో పాల్గొంది. '7 అవర్స్ టు గో' సినిమాలో పోలీసుగా నటించి మెప్పించింది.

షారుక్ జీరో సినిమాలో చిన్నపాత్ర పోషించింది .ఫక్రీ రిటర్న్స్ సినిమాలోని 'మెహబూబా' పాటకు ఆడిపాడింది. 2014లో హిందీ బుల్లితెర నటుడు అలీ గోనీతో ప్రేమలో పడింది. తర్వాత విడిపోయింది. మిగతా విదేశీ మోడళ్లలాగే అందాల ఆరబోతలో నటాషా దుమ్మురేపుద్ది. టూ పీస్ బికినీలో బీచ్ లో ఆమె మోడల్ దర్పం చూడాల్సిందే. తాజా ఫోటోలే అందుకు సూచిక‌.