పెళ్లికి ముందే తల్లిని చేసిన టీమిండియా ప్లేబోయ్

Mon Jun 01 2020 10:15:32 GMT+0530 (IST)

Hardik Pandya Announces Natasa Stankovic Pregnancy

టీమిండియా ఆల్ రౌండర్ .. హార్డ్ హిట్టర్ హార్థిక్ పాండ్యా  పెళ్లికి ముందే తండ్రయ్యాడు. తాను ప్రేమించిన నటాసా స్టాంకోవిక్ గర్భవతి అని హార్దిక్ స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పటికే ఈ జంటకు నిశ్చితార్థమైంది. మగువల గుండెల్లో మారాజాగా పాపులరైన హిట్టర్ హార్థిక్ గత రెండేళ్లుగా నటాషాతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పలువురు బాలీవుడ్ నాయికలతో ఎఫైర్లు సాగిస్తున్నాడన్న వార్తల నడుమ  వాటన్నిటికీ చెక్ పెట్టేస్తూ నటాషాని అందరికీ పరిచయం చేశాడు.ప్రస్తుతం హార్థిక్ తండ్రి అవుతున్నాడన్న వార్త బాలీవుడ్ సహా అన్నిచోట్లా దావానలంలా వ్యాపించింది. పలువురు ఆటగాళ్లు ఇప్పటికే హార్థిక్ కి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో విరాట్ కోహ్లీ- చావల్- మయాంక్ అగర్వాల్- మహమ్మద్ సమీ ఉన్నారు. అలాగే టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రత్యేకించి హార్థిక్ కి శుభాకాంక్షలు తెలిపారు. యువ జంట కొత్త ప్రయాణాన్ని అభినందించారు.

ఇన్ స్టాగ్రామ్ లో హార్దిక్ పోస్ట్ కు సమాధానమిస్తూ.. టీమిండియా కెప్టెన్ కోహ్లీ తనదైన శైలిలో పోయెటిక్ గానే స్పందించాడు. ``మీ వంశంలోని 3 వ సభ్యుడు హెచ్.కి ప్రేమ పూర్వక ఆశీస్సులు`` అని విషెస్ తెలిపాడు. ఇక వీరితో పాటు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టితో పాటు పలువురు బాలీవుడ్ తారలు.. టీవీ నటులు కూడా ఈ జంటను అభినందించారు. అటుపై హార్దిక్ వరుస ఫోటోలను ఇన్ స్టా ద్వారా రివీల్ చేశాడు. వాటిలో మొదటిది తమ బిడ్డ బేబి బంప్ ఫోటో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ఎంతో ఎమోషనల్ గానూ హార్థిక్ స్పందించాడు. కొత్త జీవితాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపాడు. త్వరలోనే నటాషాని పెళ్లాడనున్నానని కూడా హార్థిక్ వెల్లించాడు.