రియల్ గ్యాంగ్ స్టర్ స్టోరీతో హ్యాపీడేస్ హీరో..!

Mon Jun 14 2021 15:00:01 GMT+0530 (IST)

Happy Days Hero with Real Gangster Story ..!

హ్యాపీ డేస్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాహుల్ ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించాడు కాని అవి పెద్దగా ఆకట్టుకోలేదు. బక్క పల్చని పర్సనాలిటీ వల్ల సినిమా లో రాహుల్ ను టైసన్ అంటూ పిలిచే వారు. ప్రేక్షకులు కూడా అతడిని టైసన్ అన్నట్లుగానే పిలుస్తూ ఉండేవారు. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత కనిపించిన టైసన్ నిజంగా టైసన్ మాదిరిగా అయ్యాడు. సిక్స్ ప్యాక్ బాడీ.. కండలు.. మీసాలు మొత్తంగా హ్యాపీ డేస్ రాహుల్ అంటే కాస్త అనుమానం వ్యక్తం చేసే మాదిరిగా అతడు మారాడు.కండలు.. మీసాలు పెంచిన రాహుల్ సినిమా ఒకటి కన్ఫర్మ్ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన గ్యాంగ్ స్టర్ అజీజ్ రెడ్డీ కథాంశంతో ఒక సినిమా ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రియల్ పాత్రలకు కల్పిత కథనంను జత చేసి రూపొందించబోతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమా లో రాహుల్ పాత్ర ఏంటీ అనే విషయమై ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. మొత్తానికి అజీజ్ కథతో ఈ సినిమా రూపొందబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

2008 లో ఎన్ కౌంటర్ లో మృతి చెందిన అజీజ్ కు ఎన్నో కేసులతో సంబంధం ఉంది. చివరకు 1993 లో జరిగిన ముంబయి పేళ్లుడుకు కూడా అతడి హ్యాండ్ ఉన్నట్లుగా పోలీసులు ఆ సమయంలో పేర్కొన్నారు. అంతటి డేంజరస్ అజీజ్ రెడ్డీ బయోపిక్ అంటే వివాదాలు మరియు కాస్త బెదిరింపులు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అయినా కూడా ధైర్యంగా ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు.