సర్రియేల్ కామెడీ అంటే ఏంటీ సుయోధన!

Wed Jun 29 2022 16:57:20 GMT+0530 (IST)

Happy Birthday Trailer Out Now

వెరైటీ ప్రమోషన్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ఆకట్టుకుంటున్న మూవీ 'హ్యాపీ బర్త్ డే'. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించింది. వెన్నెల కిషోర్ సత్య అగస్త్య ఇతర పాత్రల్లో నటించారు. రితేష్ రానా దర్శకత్వం వహించారు. క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి మైత్రీ మూవీమేకర్స్ ఈ మూవీని నిర్మించింది. జూలై 15న విడుదవల చేయాలని ప్లాన్ చేసిన ఈ మూవీని కాస్త ముందుగానే అంటే జూలై 8నే విడుదల చేస్తున్నారు.  ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ టీజర్ లకు మంచి స్పందన లభిస్తోంది. టీజర్ సినిమా ఆద్యంతం కామెడీ ఎంటర్ టైనర్ గా నవ్వులు పూయించడం ఖాయం అనే విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా స్టార్ డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి బుధవారం విడుదల చేశారు.

రితేష్ రానా అధివాస్తవిక కామెడీ కాలభైరవ మత్తెక్కించే సంగీతం బాక్సాఫీస్  విజయం కోసం ఇవొక శక్తివంతమైన కలయిక. రితేష్ తనకంటూ ఓ సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. అద్భుతమైన ట్రైలర్. లావన్య త్రిపాఠి క్లాప్ బోర్డ్ మైత్రీ మూవీస్.. హ్యాపీ బర్త్ డే టీమ్ కి నా ప్రత్యేక శుభాకాంక్షలు' అని రాజమౌళి చిత్ర బృందాన్ని అభినందించారు.

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై మంచి క్రేజ్ ని హైప్ ని క్రియేట్ చేస్తే ట్రైలర్ దాన్ని మరింతగా పెంచేసి సినిమాకు మరింత బజ్ ని క్రియేట్ చేస్తోంది. 'మత్తు వదలా' పేరుతో విభిన్నమైన మూవీని అందించిన రితేష్ రానా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

'కాలింగ్ బెల్ మోగటంతో రెడ్ కలర్ థీమ్ విజువల్స్ తో ట్రైలర్ మొదలైంది.. లావణ్య త్రిపాటి కెమెరా ముందుకు రాగానే గన్ సౌండ్.. సర్రియేల్ కామెడీ అంటే ఏంటీ సుయోధన.. అనే సంభాషణలతో విజువల్స్ మొదలయ్యాయి. నా ఏడు వారాల నగలతో గన్ చేయించానని ఓ మహిళ చెబుతుంటే.. నేనూ నా రవ్వల నెక్లెస్ తో చేయించానని మరో మహిళ గన్ చూపించడం.. ఓ వ్యక్తి పార్టీలో డ్రింక్ .. రివాల్వర్ లో వున్న రాజసం పిస్తోల్ లో లేదండి .. అనడం.. నవ్వులు పూయిస్తోంది.

ఇంతకీ లావణ్య పాత్రకు.. వెన్నెల కిషోర్ సత్య అగస్త్య ల పాత్రలకు వున్న సంబంధం ఏంటీ? .. ఇంతకీ ఈ ముగ్గురిలో హీరో ఎవరు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. డబుల్ ఫన్..డబుల్ యాక్షన్..డబుల్ బడ్జెట్ .. అంటూ థియేటర్లలో కామెడీ ని అందించడానికి ఈ మూవీని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి ఈ మూవీలో కమెడియన్ లతో పోటీపడి తనదైన టైమింగ్ తో ఆకట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది. గన్ కల్చర్ ని ఫన్నీగా తీసుకుని సెటైరికల్ కామెడీగా ఈ మూవీని రూపొందించినట్టుగా తెలుస్తోంది.

'చావు కబురు చల్లగా' మూవీ తరువాత లావణ్య త్రిపాఠి నటించిన చిత్రమిది. అయితే ఫుల్ ఆఫ్ ఫన్ ఎలిమెంట్స్ తో ఈ మూవీని రూపొందించారు. ట్రైలర్ చూస్తుంటే డిఫరెంట్ స్టోరీ లైన్ తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 8న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలంటే అంత వరకు వేచి చూడాల్సిందే.