హ్యాపీ బర్త్ డే సూపర్ ట్యాలెంటెడ్ 'చంద్రముఖి'

Sun Oct 18 2020 16:20:08 GMT+0530 (IST)

Happy Birthday Super Talented 'Chandramukhi'

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీ చంద్రముఖి సినిమాలో కీలక పాత్ర పోషించిన జ్యోతికను సౌత్ ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. ఆ పాత్రలో జ్యోతిక కనబర్చిన నటన సినిమా స్థాయిని పెంచింది. అంతకు ముందు ఆ తర్వాత కూడా జ్యోతిక పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తమిళ.. తెలుగు.. కన్నడం మరియు మలయాళంలో నటించి మెప్పించిన జ్యోతిక 2006 సంవత్సరంలో కోలీవుడ్ హీరో సూర్యను వివాహం చేసుకుని ఆ తర్వాత సినిమాలకు స్వస్థి చెప్పింది. పెళ్లి పిల్లలు వంటి బాధ్యతల కారణంగా సినిమాలకు దూరం అయిన జ్యోతిక పిల్లలు పెద్ద వారు అవ్వడంతో మళ్లీ భర్త సూర్య ప్రోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తోంది.లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటున్న జ్యోతిక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తోంది. ఈమె నటించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మళ్లీ తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. మల్టీ ట్యాలెంటెడ్ నటిగా గుర్తింపు దక్కించుకున్న జ్యోతిక పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆమెకు అందరి తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమె మరిన్ని మంచి సినిమాలను చేయాలని ఆమె వైవాహిక జీవితం ఎప్పుడు సంతోషంగా సాగాలంటూ అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.