Begin typing your search above and press return to search.

క‌శ్మీర్ మంచులో `లెఫ్టినెంట్ రామ్` లొకేష‌న్ల వేట‌

By:  Tupaki Desk   |   24 Jan 2021 1:10 PM GMT
క‌శ్మీర్ మంచులో `లెఫ్టినెంట్ రామ్` లొకేష‌న్ల వేట‌
X
దుల్కర్ సల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `లెఫ్టినెంట్ రామ్`. హను రాఘవపుడి ద‌ర్శ‌కుడు. త్వరలో ఈ మూవీ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా- వైజయంతి ఫిల్మ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వాప్నా దత్ నిర్మాత‌.

ఈ చిత్రం షూటింగ్ కోసం హను తన కీల‌క‌ సిబ్బందితో పాటు లొకేషన్ల వేట సాగిస్తున్నారు. ఇటీవల కాశ్మీర్‌కు వెళ్లారు. యాధృచ్ఛికంగా అల్లుడు అదుర్స్ నుండి ఒక పాటను కొన్ని వారాల క్రితం కశ్మీర్ లో చిత్రీకరించారు. దుల్కర్ చిత్రం ప్రధాన షెడ్యూల్ కాశ్మీర్ లో చిత్రీకరించే వీలుంద‌న్న క్లారిటీ దీంతో వ‌చ్చేసిన‌ట్టే.

హను స్కౌట్ చేస్తున్న ప్రాంతం గత కొన్ని రోజులుగా భారీ హిమపాతంతో మైన‌స్ చ‌లిలోకి వెళ్లింది. వాతావరణం భారీ సవాల్ గా మారుతుందని దర్శకుడు స్వయంగా అంగీకరించారు. అయితే మార్చిలో అడుగుపెట్ట‌క ముందే మంట‌లు పుట్టించే వాతావ‌ర‌ణం మ‌న‌కు ఉంటుంది కాబ‌ట్టి ఆ లొకేష‌న్ కి స‌మ్మ‌ర్ లో ప్లాన్ చేస్తారా? అన్న‌ది చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంది.