Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ అదృష్టం ఏంటి ఇలా ఉంది. ఈ మూవీ కూడా ఆగినట్లేనా..??

By:  Tupaki Desk   |   17 July 2020 2:30 AM GMT
ఆ డైరెక్టర్ అదృష్టం ఏంటి ఇలా ఉంది. ఈ మూవీ కూడా ఆగినట్లేనా..??
X
ఇండియన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు తెరకు సుపరిచితుడుగా మారాడు మలయాళం యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమాలకు మలయాళంలో సూపర్ క్రేజ్ ఉంది. ఆ తర్వాత తెలుగులో మహానటి సినిమా చేసాడు. కానీ ఇంతవరకు తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు. ఇక ఈ వెరీ టాలెంటెడ్ హీరోని టాలీవుడ్ తెరకు సోలో హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేసాడు. ప్రస్తుతం వరుస ప్లాప్ లలో ఉన్నాడు హను. అయినాసరే హను దర్శకత్వంలో సోలో హీరోగా తెలుగులో నటించేందుకు రెడీ అవుతున్నాడు దుల్కర్. ఇప్పటికే దుల్కర్‌కు కథ వినిపించి ఓకే చేయించుకున్న హను..

అందులో కథానాయికగా పూజాకు కూడా కథను వినిపించాలని సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా జరగడం లేదు. దీంతో లాక్‌డౌన్ ముగియగానే పూజా హైదరాబాద్ చేరుకుంటుందని, అప్పుడు ఆమెకు కథ వినిపించి ఓకే చేయించుకోవాలని చిత్ర యూనిట్ కాచుకొని కూర్చుంది. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు డైరెక్టర్ హను టీమ్ రెడీ అవుతుంది. మరి వరుస ప్లాప్ సినిమాలు తీసిన హనుతో దుల్కర్ సోలో హిట్ అందుకుంటాడా? అంటే తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలు ఎక్కేలా లేదని ఇండస్ట్రీ టాక్.

ఎందుకంటే దుల్కర్ చేతినిండా ప్రస్తుతం సినిమాలు ఉన్నాయి. లాక్ డౌన్ లేకపోతే అన్నీ ప్రాజెక్ట్ లకు టైం కేటాయించేవాడు. కానీ అన్నీ ఆగిపోవడంతో.. ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ అయ్యేలా లేవట. ఉన్న సినిమాలను పూర్తి చేశాకే హను సినిమా మొదలు పెడతాడని సమాచారం. మరి అసలే ప్లాప్ సినిమాలతో వెనకబడిన హను.. ఖచ్చితంగా హిట్ కొట్టాలని పూనుకున్నాడట. మరి దానికి తగ్గట్లే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నాడట. అసలే ప్లాప్ లలో ఉన్న హనుకి దుల్కర్ సినిమా కూడా ఇప్పట్లో కుదిరేలా లేకపోవడంతో అదృష్టం లేదని అంటున్నాయి సినీ వర్గాలు. ఇక లాభం లేదని వేరే స్క్రిప్ట్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. చూడాలి మరి దుల్కర్ సినిమా కుదరకపోతే ఏ హీరోతో చేయనున్నాడో..!!