Begin typing your search above and press return to search.

దేశ ముదురు బ్యూటీ పెళ్లి వేడుక.. హన్సిక మంచి మనసుకు నిదర్శనం

By:  Tupaki Desk   |   4 Dec 2022 5:30 PM GMT
దేశ ముదురు బ్యూటీ పెళ్లి వేడుక.. హన్సిక మంచి మనసుకు నిదర్శనం
X
అల్లు అర్జున్‌ హీరోగా నటించిన దేశ ముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక. ఈ అమ్మడు తెలుగు లో వరుసగా సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. తెలుగు లో బిజీగా ఉన్న సమయంలో కోలీవుడ్‌ లో అడుగు పెట్టి అక్కడ ఇక్కడ వరుస సినిమాలు చేసి మంచి పేరును దక్కించుకుంది.

గత కొన్నాళ్లుగా తమిళం కు పరిమితం అయిన ముద్దుగుమ్మ హన్సిక పెళ్లి పీటలు ఎక్కింది. తన ప్రియుడిని వివాహం చేసుకోబోతుంది అంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. హన్సిక పెళ్లి వార్తలు ప్రతి రోజు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఆమె యొక్క పెళ్లి ఫొటోలు మరియు వీడియోలు ఇతర విషయాలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా హన్సిక యొక్క పెళ్లికి సినీ ప్రముఖులను ఇతర ప్రముఖులను కాకుండా సామాన్య నిరుపేద పిల్లలకు ఆహ్వానం ఇచ్చింది. హన్సిక పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎన్జీఓలు నిర్వహిస్తూ నిరుపేద పిల్లలకు విద్యాబుద్దులు చెప్పిస్తుంది.

ఆ ఎన్జీఓకు చెందిన పిల్లల్లో కొందరికి హన్సిక తన పెళ్లి ఆహ్వానంను అందించింది. తమను పెళ్లికి ఆహ్వానించిందుకు హన్సిక దంపతులకు ఎన్జీఓ విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్జీఓ కు చెందిన పిల్లలను తన పెళ్లికి ఆహ్వానించడం ద్వారా తన గొప్ప మనసును హన్సిక చూపించింది.