Begin typing your search above and press return to search.

'ఫిగర్'తో సెగలు రాజేస్తున్న దేశముదురు భామ!

By:  Tupaki Desk   |   4 July 2020 10:10 AM GMT
ఫిగర్తో సెగలు రాజేస్తున్న దేశముదురు భామ!
X
ముద్దుగుమ్మ హన్సిక.. అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. చూడగానే ముద్దుగా బొద్దుగా కనిపించే హన్సిక.. తెలుగు ఇండస్ట్రీలోకి అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశముదురు' సినిమాతో అడుగుపెట్టింది. హన్సిక అలా ఇండస్ట్రీలో కాలు పెట్టిందో లేదో.. అప్పుడే అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. దేశముదురు సినిమాలో అందమైన నటనతో.. లేలేత అందాలతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికి కొందరు కుర్రాళ్లకు అందాలరాణి అని చెప్పాలి. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది హన్సిక. ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. అలా తెలుగులో బిజీగా ఉన్నప్పుడే తమిళ ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ రావడంతో అటు వైపు కూడా అడుగులేసింది. అమ్మడు ఎక్కడ అడుగేసినా అదృష్టమే అన్నట్లుగా హిట్ల మీద హిట్లు కొట్టింది.

అయితే గత కొంతకాలంగా హన్సిక తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా బిజీ అయిపోయింది. అడపాదడపా తెలుగులో మెరిసినా బ్యూటీ చివరి తెలుగు సినిమా 'తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి'. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంటున్న ఈ భామ వర్కౌట్లతో బిజీగా ఉంటోందట. తెలుగులో స్టార్ హీరోల‌తో న‌టించిన ముద్దుగుమ్మను ఇప్పుడేమో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు. త‌మిళ‌నాట కూడా ఇప్పుడు హ‌న్సిక‌ను ప‌ట్టించుకునేవాళ్లే లేరు. కాక‌పోతే చాలా సినిమాలు చేసింది కాబ‌ట్టి స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ ఉంది. అందుకే ఈ మ‌ధ్య కాస్త బ‌రువు త‌గ్గించి ఫోటోషూట్లతో ద‌ర్శ‌నమిస్తుంది హ‌న్సిక‌. ఇప్పుడు కేవ‌లం అందాల‌నే న‌మ్ముకుంటుంది ఈ మిల్కీ బొమ్మ‌. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తే ముట్టుకుంటే కందిపోతుందేమో అనిపించే ఈ గుమ్మ ఓర చూపులతో కాటేస్తోంది. ప్రస్తుతం అమ్మడి ఫోటో నెటిజన్ల మనసు దోచుకుంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అమ్మడి స్లిమ్ ఫిగర్ చూసి కుర్రాళ్లంతా నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు. టాప్ ఫిగర్లకు ఏ మాత్రం తీసిపోని అమ్మడి ఫిగర్ నెట్టింట సెగలు రేపుతోంది.