Begin typing your search above and press return to search.

పాల బుగ్గ‌ల హ‌న్సిక క‌వ్వింత తుళ్లింత‌!

By:  Tupaki Desk   |   31 May 2020 4:27 AM GMT
పాల బుగ్గ‌ల హ‌న్సిక క‌వ్వింత తుళ్లింత‌!
X
పాల బుగ్గ‌ల హ‌న్సిక ఇంట్ర‌డ‌క్ష‌న్ అవ‌స‌రం లేదు. మిల్కీ అందాల‌తో కుర్ర‌కారు కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్యాలెంట్ ఈ అమ్మ‌డి సొంతం. దేశ‌ముదురు మొద‌లు హ‌న్సిక ద‌శాబ్ధం పాటు టాలీవుడ్ లో కెరీర్ సాగించినా ఎందువ‌ల్ల‌నో ఆశించిన రేంజుకు మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం త‌మిళంలో అడ‌పాద‌డ‌పా సినిమాల్లో నటిస్తోంది కానీ తెలుగులో అవ‌కాశాలు మాత్రం అందుకోలేక‌పోతోంది.

`గౌత‌మ్ నందా` త‌ర్వాత టాలీవుడ్ కి పూర్తిగా దూర‌మైపోయిన హ‌న్సిక‌ `ఎన్టీఆర్ -క‌థానాయ‌కుడు` లో కామియోలో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఇక్క‌డ పూర్తిగా జీరో అయిపోయింది. ఆపిల్ బ్యూటీ ఇమేజ్ అయినా క‌నీస అవ‌కాశాల్ని తేలేక‌పోతోంది మ‌రి. ఆ క్ర‌మంలోనే ఇదిగో ఇలా సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌తో రెగ్యుల‌ర్ గా ట‌చ్ లో ఉంటోంది. తాజాగా అందాల హ‌న్సిక కు సంబంధించిన పార్టీ మూడ్ స్టిల్స్ వైర‌ల్ గా మారాయి.

ఈసారి పూల్ సైడ్ ట్రీట్ తో పాటు వైట్ టాప్ లో క‌వ్విస్తున్న ఫోటోల్ని హ‌నీ షేర్ చేసింది. యాపిల్ అంద బ్యాక్ లెస్ ఫోజులు మురిపిస్తున్నాయి. ఇన్ని ర‌కాలుగా‌ యాపిల్ అందం నిగ‌నిగ‌లు యూత్ కి వేడెక్కించేస్తున్నాయ్. ప్ర‌స్తుతం మ‌హ‌మ్మారీ భార‌త్ ని ఊపేస్తుంటే హ‌న్సిక‌ మ‌రీ ఇలా సెల‌బ్రేష‌న్ మూడ్ లో ఉందేమిటో? అన్న‌ట్టు మాజీ ల‌వ‌ర్ శింబుతో సినిమా ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది? రీయూనియ‌న్ లో కొత్త సంగ‌తి ఏమైనా ఉందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. తాజాగా బ్రాండ్ న్యూ వీడియో .. `వాట్ కీప్స్ మి గోయింగ్: ఏ షార్ట్ మెమోయిర్` అంటూ ఓ వీడియోని లాంచ్ చేసింది హ‌న్సిక‌. ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే హ‌న్సిక కూడా సెల్ఫ్ డ‌బ్బా కొడుతోందని అర్థ‌మ‌వుతోంది.