Begin typing your search above and press return to search.

క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలని డిసైడైన టాలెంటెడ్ యాక్టర్...?

By:  Tupaki Desk   |   19 Oct 2020 9:50 AM GMT
క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలని డిసైడైన టాలెంటెడ్ యాక్టర్...?
X
సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. నిలదొక్కుకున్నవారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఒకరని చెప్పవచ్చు. 'మిస్టర్ పర్ఫెక్ట్' మూవీలో చిన్న రోల్ లో కనిపించిన సత్యదేవ్.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'ముకుంద' 'అసుర' వంటి ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత పూరీ 'జ్యోతి లక్ష్మి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఈ క్రమంలో వైవిధ్యభరిత సినిమాలు విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. 'క్షణం' 'అంతరిక్షం' 'ఘాజీ' 'బ్లఫ్ మాస్టర్' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' 'సరిలేరు నీకెవ్వరు' '47 డేస్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల ఓటీటీలో రిలీజైన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో సత్యదేవ్ హీరోగా మరో మెట్టు ఎక్కాడు. అలానే వెబ్ వరల్డ్ లో అడుగుపెట్టి 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' 'లాక్డ్' అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. ఈ నేపథ్యంలో సత్యదేవ్ కు ఉన్న డిమాండ్ మేరకు రెమ్యూనరేషన్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా తర్వాత మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిపోయిన సత్యదేవ్.. క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోగా నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో స్టార్ హీరోయిన్ మిల్కీబ్యూటీ తమన్నా తో కలిసి నటిస్తున్నాడు. ఇది కన్నడ సూపర్ హిట్ 'లవ్ మాక్ టైల్'' చిత్రానికి రీమేక్‌ గా తెరకెక్కుతోంది. దీంతో పాటు 'తిమ్మరసు' అనే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో రానున్న సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు తాను నటించే సినిమాలకు వెబ్ సిరీస్ లకు సత్యదేవ్ సుమారు కోటి రూపాయ‌ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. 'గుర్తుందా శీతాకాలం' మూవీకి కోటి డిమాండ్ చేసిన సత్య.. చివరకు 75 ల‌క్ష‌ల‌ వరకు డీల్ కుదుర్చున్నాడని టాక్. ఇక 'తిమ్మ‌రుసు' సినిమాకి కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేసాడట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత సత్యదేవ్ బాగా వంటబట్టించుకున్నాడని.. అందుకే క్రేజ్ ఉన్నపుడే క్యాష్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ను ఫాలో అవుతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.