Begin typing your search above and press return to search.

శాకుంతలం గురించి బాగా రీసెర్చ్‌ చేశాడే

By:  Tupaki Desk   |   31 Oct 2020 4:00 PM GMT
శాకుంతలం గురించి బాగా రీసెర్చ్‌ చేశాడే
X
భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న గుణశేఖర్‌ అయిదు సంవత్సరాలుగా కొత్త సినిమాను ప్రారంభించడంలో విఫలం అయ్యాడు. రుద్రమదేవి సినిమా తర్వాత రెండు సినిమాలు అనుకుంటే ఆ రెండు సినిమాలు కూడా కార్యరూపం దాల్చలేదు. హిరణ్యకశ్యప సినిమా మొదలు అయినట్లే అనుకుంటే కరోనా కారణాల వల్ల సినిమాను వాయిదా వేశారు. ఆ సినిమా కంటే ముందు అద్బుత దృశ్య కావ్యం.. ఎవర్‌ గ్రీన్‌ లవ్‌ స్టోరీ అయిన శాకుంతల మరియు దుష్యంతల ప్రణయగాధను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా కోసం గుణశేఖర్‌ చాలా రీసెర్చ్‌ చేసినట్లున్నాడు. వందల ఏళ్ల క్రితం ముచ్చట్లను సినిమా సందర్బంగా చెప్పుకొచ్చాడు.

శాకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్‌ విలియమ్స్‌ జాన్స్‌ ట్రాన్స్‌ లేట్‌ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రెంచ్‌.. ఆస్ట్రేలియన్‌.. ఇటాలియన్‌ ఇలా 46 భాషల్లో శాకుతంలం నాటకం ప్రదర్శించారు. చరిత్రలో ఇన్ని భాషల్లో ప్రదర్శించబడ్డ నాటకం ఇదే అయ్యి ఉంటుందని గుణశేఖర్‌ పేర్కొన్నాడు.

మొత్తానికి సినిమా ఎలా తీస్తాడో కాని శాకుంతల దుష్యంతుడి కథ మరియు దాని పరిణామాల గురించి గుణశేఖర్‌ చాలా బాగా రీసెర్చ్‌ చేశాడే అంటూ నెటిజన్స్‌ కితాబిస్తున్నారు. వచ్చే ఏడాదిలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాలో శకుంతల పాత్రను ఎవరు పోషించబోతున్నారు అనే విషయం ఇప్పుడు అందరికి ఆసక్తికరంగా మారింది. దుష్యంతుడి పాత్ర కూడా చాలా కీలకం. కనుక ఆ పాత్రకు ఎవరు ఓకే చెప్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది.