Begin typing your search above and press return to search.

గిల్టీ ట్రైల‌ర్: వామ్మో కియ‌రా రేప్

By:  Tupaki Desk   |   18 Feb 2020 10:00 AM GMT
గిల్టీ ట్రైల‌ర్: వామ్మో కియ‌రా రేప్
X
ల‌స్ట్ స్టోరీస్.. ఘోస్ట్ స్టోరీస్.. అంటూ వెబ్ సిరీస్ ల‌తో అగ్గి రాజేస్తున్న సంగ‌తి తెలిసిందే. అర‌చేతి మొబైల్ లో వెబ్ సిరీస్ ల వీక్ష‌ణ పెర‌గ‌డంతో ఈ త‌ర‌హా మ‌రిన్ని తెర‌కెక్కుతున్నాయి. ఇంత‌కుముందు ల‌స్ట్ స్టోరీస్ లో కియ‌రా అద్వాణీ పెర్ఫామెన్స్ ఇర‌గ‌దీసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ కోసం క‌ర‌ణ్ జోహార్ తో క‌లిసి మ‌రోసారి క్రేజీ ఎటెంప్ట్ చేసింది. `గిల్టీ` అనేది తాజా సిరీస్ టైటిల్. తాజాగా ట్రైల‌ర్ రిలీజైంది.

ఇందులో కియ‌రా ఓ కాలేజ్ గాళ్. త‌న స్నేహితుల‌తో క‌లిసి జాలీ లైఫ్ ని లీడ్ చేస్తుంటుంది. ఆ క్ర‌మంలోనే ఒక రాత్రి అనూహ్యంగా వారి జీవితాల్ని మార్చేస్తుంది. కియ‌రా స్నేహితుల్లో ఒక‌రు రేప్ కి గుర‌వుతారు. అయితే అత‌డిని రేప్ చేసింది ఒక అమ్మాయి! అంటూ స‌స్పెన్స్ ని క్రియేట్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. ఇంత‌కీ ఎవ‌రు ఎవ‌రిని రేప్ చేశారు? అమ్మాయి అబ్బాయిని రేప్ చేసిందా.. ? లేక అబ్బాయి అమ్మాయిని రేప్ చేసి త‌ప్పు దారి ప‌ట్టిస్తున్నాడా? అన్న‌ది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ట్రైల‌ర్ ఆద్యంతం స‌స్పెన్స్ థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ తో ర‌క్తి క‌ట్టించింది. ఇక షో ఆద్యంతం కియ‌రా చెల‌రేగిపోయి న‌టించింది. కియ‌రా అల్టిమేట్ మోడ్ర‌న్ లుక్ .. ముక్కు పుడ‌క‌తో అల్ట్రా మోడ్ర‌న్ యాటిట్యూడ్ ని ప్ర‌ద‌ర్శించిన వైనం వేడెక్కించాయి. ఇక సిగ‌రెట్ ద‌మ్ కొడుతూ సెగ‌లు పుట్టించింది. కాలేజ్ స్టూడెంట్స్ అత్యాచారం మిస్ట‌రీ అంటూ వెబ్ సిరీస్ మ‌సాలా కంటెంట్ తో వేడెక్కించ‌బోతోంద‌నే చెప్పాలి.

బాలీవుడ్ లో ఇంత‌కుముందు చాలా రేప్ డ్రామాలు చూశాం. భూమి -మాత్రు - కాబిల్ - సెక్షన్ 375 .. ఇవ‌న్నీ అత్యాచారం నేప‌థ్యంలో సినిమాలు. పగ - పశ్చాత్తాపం అనే కోణాన్ని వీటిలో ఆవిష్క‌రించారు. అయితే గిల్టీలో కియ‌రా పాత్ర‌లోనే ఏదో సంథింగ్ తేడా కొడుతోంది. స్వేచ్ఛా-ఉత్సాహభరితమైన పాత్ర .. అందులో చిలిపి పనుల అనాలోచితంగానే అనిపిస్తోంది. మ‌రి ఆ పాత్ర‌లో స‌స్పెన్స్ యాంగిల్ ఏమిటి? అన్న‌ది రివీల్ కావాల్సి ఉంది. మార్చి 6 న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కు రంగం సిద్ధ‌మ‌వుతోంది.