Begin typing your search above and press return to search.

మహేష్‌ ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహ పర్చే గాసిప్‌

By:  Tupaki Desk   |   2 Aug 2021 3:30 PM GMT
మహేష్‌ ఫ్యాన్స్ ను కాస్త నిరుత్సాహ పర్చే గాసిప్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. జక్కన్న రాజమౌళిల కాంబోలో సినిమా దాదాపుగా పదేళ్ల క్రితం అనుకున్నారట. అంటే బాహుబలి సినిమా కంటే ముందుగానే కేఎల్‌ నారాయణ బ్యానర్‌ లో మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రూపొందాల్సి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా అదుగో ఇదుగో అంటూ వస్తున్నారు.

బాహుబలి సినిమా కు ముందు కొన్ని కారణాల వల్ల వీరి కాంబో మూవీ పట్టాలెక్కలేక పోయింది. అంతే కాకుండా రాజమౌళి బాహుబలిని వెంటనే భారీ బడ్జెట్‌ తో తీయాలని అనుకున్నాడు. దాంతో మహేష్‌ తో సినిమా పట్టాలెక్కించలేక పోయాడు. ఎట్టకేలకు మహేష్‌ తో సినిమాకు రంగం సిద్దం అవుతోంది. బాహుబలి తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయాలంటే రెండేళ్ల పాటు వెయిట్‌ చేయాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో వెంటనే ఈ భారీ మల్టీ స్టారర్‌ ను జక్కన్న చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆర్‌ ఆర్‌ ఆర్‌ తర్వాత జక్కన్న చేయబోతున్న మూవీ ఖచ్చితంగా మహేష్‌ బాబు సినిమానే అనే అభిప్రాయం అంతా వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళితో పాటు వియేంద్ర ప్రసాద్‌ ఇంకా మహేష్‌ బాబు కూడా పలు ఇంటర్వ్యూల్లో తదుపరి సినిమా ఇదే అంటూ క్లారిటీ ఇచ్చారు. దాంతో వచ్చే ఏడాది మహేష్‌ బాబు.. రాజమౌళి సినిమా పట్టాలెక్కడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా వెయిట్‌ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్‌ బాబు అభిమానులు కాస్త నిరుత్సాహ పడే పుకారు ఒకటి సోషల్‌ మీడియాలో షికారు చేస్తోంది.

అదేంటి అంటే రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ తర్వాత చేయబోతున్న సినిమా కూడా ఒక భారీ మల్టీ స్టారర్ గానే రూపొందబోతుందని అంటున్నారు. ఒక స్టార్‌ గా మహేష్ బాబు నటించబోతుండగా మరో స్టార్‌ వేరే భాషకు చెందిన సూపర్‌ స్టార్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ పుకార్లు కొందరికి వావ్‌ అనే ఫీలింగ్ ను కలుగజేస్తున్నా కూడా మహేష్ బాబు అభిమానులు మాత్రం తమ బాబు కు మాత్రమే సింగిల్‌ క్రెడిట్‌ వస్తే బాగుంటుందని.. బాహుబలి తో ప్రభాస్ సోలో సూపర్ స్టార్‌ గా ఎలా అయితే పేరు గుర్తింపు దక్కించుకున్నాడో అలాగే మహేష్‌ బాబుతో రాజమౌళి సినిమా చేస్తే అలాంటి క్రెడిట్‌ వస్తుంది. ఇద్దరు హీరోలు ఉండటం వల్ల కాస్త పోటీ తప్పదు అంటున్నారు.

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ప్రతి ఒక్క మహేష్‌ బాబు అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. రాజమౌళి ఇప్పటి వరకు మహేష్‌ బాబు మూవీ గురించిన ఆలోచనలు మొదలు పెట్టాడా అంటే ఏమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మహేష్‌ బాబు కోసం భారీ అడ్వంచర్‌ ఆఫ్రికన్‌ నేపథ్యంలో కథను తయారు చేయాలనుకుంటున్నట్లుగా ఇటీవల పలు ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు.

ఆయన మాటలను బట్టి ఒక భారీ సూపర్‌ మ్యాన్‌ తరహా సినిమాను మహేష్‌ బాబుతో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ అప్‌ డేట్‌ తప్ప మల్టీ స్టారర్‌ అనే విషయమై ఎలాంటి అప్ డేట్‌ అధికారికంగా లేదు. మహేష్‌.. రాజమౌళిల కాంబో మూవీ అనగానే చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చాలా పుకార్లు పుట్టుకు వచ్చాయి. ఇప్పుడు ఈ పుకారు కూడా షికారు చేస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే తప్ప ఈ మల్టీ స్టారర్ మూవీ నిజం కాకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.