Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పాప డ్రెస్సు.. మహా వెరైటీ

By:  Tupaki Desk   |   24 Jan 2020 7:07 AM GMT
ఫోటో స్టోరీ: పాప డ్రెస్సు.. మహా వెరైటీ
X
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈమధ్య కాస్త తగ్గింది కానీ ఒక దశలో టాప్ స్టార్లతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే రకుల్ తన గ్లామర్ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. జిమ్ములో యోగాలు కసరత్తులు ఎడాపెడా చేసేస్తూ.. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించదు.

ఒకవేళ రకుల్ తన ఫోటోలను స్వయంగా పోస్ట్ చేయకపోయినా సరే రకుల్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. రకుల్ ముంబైలో అలా బయట కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలను క్లిక్కుమనిపిస్తారు. రకుల్ హిందీ సినిమాలు చేసింది కాబట్టి అక్కడ జనాలకు పరిచయమే.. అందుకే రకుల్ కు క్రేజ్ ఎక్కువే. ఈమధ్య రకుల్ అలానే ఒక చోట కనిపించింది. వెరైటీ డ్రెస్సు ధరించి అక్కడ ఉన్న జనాలను.. నెటిజన్లను ఔరా అనిపించింది. త్రీ ఫోర్త్ జీన్స్ ప్యాంట్.. పైనేమో మోకాలివరకూ ఉండే వైట్ షర్టు ధరించింది. ఆ పొడవాటి చొక్కాను సగమే టక్ చేసుకొని ప్యాంట్ కు ఒక పర్స్ లాంటి పౌచ్ ను తగిలించుకుంది. చలాకీగా నవ్వుతూ నన్ను చూడండి.. నా స్టైల్ చూడండి అన్నట్టు గా ఫోటోలకు పోజిచ్చింది.

ఈ ఫోటోలకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన దక్కింది. కొందరేమో స్టైల్ గా ఉంది అని ప్రశంసించారు. కొందరేమో డ్రెస్ వింతగా ఉందని.. ఫ్యాషన్ డిజాస్టర్ అని కామెంట్లు పెట్టారు. ఏదైతేనేం.. రకుల్ డ్రెస్ మాత్రం హాట్ టాపిక్ అయింది. రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' లో.. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో నటిస్తోంది. హిందీలో కాశ్వీ నాయర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది.