గాజు బొమ్మలా గోల్డెన్ మనోహరి తళుకుబెళుకులు

Sun Nov 28 2021 09:00:01 GMT+0530 (IST)

Gorgeous Nora Fatehi New Instagram Pic

గాజు బొమ్మలా.. బంగారు బొమ్మలా తళతళా మెరిసిపోతోంది. ముగ్ధమనోహర రూపంతో మనోహరి మనసులు దోచేస్తోంది. మునుపెన్నడూ లేని రాకుమారి వైబ్స్ తో మంత్రం వేస్తోంది. ఇంతకీ ఈ రూపం వెనక సృష్టి కర్త ఎవరు? అంటే.. నిస్సందేహంగా డిజైనర్ ద్వయం అబూ జానీ - సందీప్ ఖోస్లా. తొలి నుంచి నోరా ఫతేహీకి ఈ ద్వయం డిజైనర్లుగా కొనసాగుతున్నారు.చాలా సార్లు నోరా వీళ్లతో మ్యూజ్ ప్లే చేసింది. ప్రతి లుక్ గతం కంటే అద్భుతంగా ఉంది. సత్యమేవ జయతే 2లోని ఆమె తాజా పాట కుసు కుసు కోసం నర్తకిగా అదరగొట్టిన నోరాను డిజైన్ చేసిందే ఈ డిజైనర్ ద్వయం. నోరా ఆ పాటలో బెల్లీ డ్యాన్స్ తో అదరగొట్టగా ఆ డ్రెస్ ను కూడా వారు డిజైన్ చేసారు. ఇప్పుడు నోరా వారి లేబుల్ నుండి సమకాలీన డిజైనర్ రూపాన్ని ధరించి అదరగొట్టింది. ఈ కొత్త ఫోటోషూట్ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.

అబు జానీ- సందీప్ ఖోస్లా సృష్టిలో యోధురాలు యువరాణిని దృష్టి కనిపించింది. ఫోటోషూట్ కోసం బంగారు వర్ణం అలంకరణలు లెహంగా సెట్ ప్రతిదీ అందంగా కనిపించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోను షేర్ చేస్తూ.. అబు జానీ సందీప్ ఖోస్లా అధికారిక పేజీ లో ఇలా రాసారు. గోటా.. ది గోల్డ్ స్టాండర్డ్. నోరా ఫతేహీ రొమాంటిక్ పింక్ గోటా తుక్డీ ఘాగ్రాతో జత చేసిన స్కిన్ టూల్ పై అద్భుతమైన గోటా డిటెయిలింగ్ స్టేట్ మెంట్ బ్లౌజ్ ధరించింది. ఈ పోటో కోసం స్క్రోల్ చేయండి... అని రాసారు. ఫోటోలో నోరా ధరించిన ఎంబ్రాయిడరీ లెహంగా సెట్ లో ఫుల్ స్లీవ్ స్టేట్ మెంట్ చోలీ ఉంది. ఇది చురుకైన నెక్ లైన్... సిల్వర్ - గోల్డ్ ప్యాటర్న్ తో కూడిన గోటా డిటైలింగ్ ను షీర్ టూల్ తో అందించింది. స్టార్ టోన్డ్ మిడ్ రిఫ్ ను అంతే అందంగా ఆవిష్కరించారు. నోరా పొట్టి చోలీ గులాబీ రంగు లెహంగాను ధరించింది. అంతటా పూల నమూనాలలో సంక్లిష్ట గోటా తుక్డీ డిజైన్ ఇది. ఆ నడుము వద్ద స్కర్ట్ ను చింపి బంగారు టాసెల్ డోరీని తీర్చిదిద్దారు. చేప ఆకారపు పెండెంట్ లతో కూడిన పచ్చ పూసల హారము లెహంగా సెట్ తో నోరా లుక్ మైమరిపిస్తోంది. గజిబిజి కేశాలంకరణ సూక్ష్మమైన ఐలైనర్- మాస్కరాతో నిండిన కనురెప్పలు.. పింక్ లిప్ షేడ్.. మెరిసే ఐ షాడో ..మెరుస్తున్న చర్మం గ్లామ్ పిక్స్ లో వ్వావ్ అనిపిస్తుంది ఈ లుక్.

మరోవైపు కెరీర్ చూస్తే... నోరా పాట కుసు కుసు యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ పాట ప్లాట్ ఫారమ్లో 80 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించింది. జాన్ అబ్రహాం -దివ్య ఖోస్లా కుమార్ కాంబినేషన్ చిత్రం- `సత్యమేవ జయతే 2` నుండి ప్రత్యేక గీతమిది. సినిమాలో వైబ్రేంట్ గా ఆకట్టుకుందని వీక్షించిన వారు ప్రశంసిస్తున్నారు.