Begin typing your search above and press return to search.

గొపీచంద్ కు అదిరిపోయే మాస్ టైటిల్

By:  Tupaki Desk   |   23 Jan 2020 6:10 AM GMT
గొపీచంద్ కు అదిరిపోయే మాస్ టైటిల్
X
హీరో గోపీచంద్ ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా ఏదీ క‌లిసి రావ‌డం లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా ఉంది. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు అత‌డి గ్రాఫ్ ని కిందికి దించేశాయి. 2019లో త‌మిళ్ ద‌ర్శ‌కుడు తిరు `చాణ‌క్య` సినిమాతో త‌న‌కో హిట్ ఇస్తాడ‌నే భావించాడు. వంద శాతం ఎఫ‌ర్ట్ పెట్టి ప‌ని చేశాడు. యాక్షన్ నేప‌థ్యం లోని ఈ సినిమా కోసం తీవ్ర గాయాల‌తో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. అయినా ఎంతో శ్ర‌మించాడు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన చాణ‌క్య బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా విఫ‌ల‌మైంది. తంబీని న‌మ్మినా త‌న‌కో హిట్టు అయితే రాలేదు.

ప్రస్తుతం సంస‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. గోపి మార్క్ కామెడీ హైలైట్ గా ఉంటుంద‌ట‌. సంప‌త్ నంది రెండేళ్లుగా స‌రైన‌ అవకాశం లేక ఖాళీగానే ఉన్నాడు. చివ‌రిగా గోపీచంద్ తోనే `గౌత‌మ్ నందా` తెర‌కెక్కించాడు. ఆ సినిమా యావ‌రేజ్ అనిపించుకుంది. ఆ త‌ర్వాత వేరొక‌ హీరో సంప‌త్ కి అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో రెండేళ్లు వెయిట్ చేసి గోపీచంద్ తోనే సెట్స్ పైకి వెళ్లాడు. ద‌ర్శ‌క‌ హీరోలు ఇద్ద‌రూ ఫెయిల్యూర్ లో ఉన్న నేప‌థ్యంలో స‌క్సెస్ కోసం క‌సిగా పనిచేస్తున్న‌ట్లు స‌మాచారం. స‌రైన‌ హిట్టు కొట్టి ప‌రిశ్ర‌మ మొత్తం త‌మ గురించి మాట్లాడుకునేలా చేయాల‌న్నంత క‌సి వాళ్లిద్ద‌రిలో క‌నిపిస్తుంద‌ని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రా త‌ర‌పున‌ లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్ కి కోచ్ గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్ గా చేస్తోంది. ఆ ఇద్ద‌రూ ఎదురు ప‌డితే మాస్ విజిల్స్ వేస్తార‌ట‌.

అందుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమాకు సీటీమార్ అనే మాస్ టైటిల్ ను ఖ‌రారు చేసారు. సీటీమార్ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. గ‌తంలో డీజే సినిమాలో సీటీమార్ పాట ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. సీటీమార్.. సీటీమార్...ఎన్టీఆర్. ఏఎన్నార్...మెగాస్టార్ అంటూ సాగిన పాట అప్ప‌ట్లో బ‌న్నీ అభిమానుల‌ను ఓ ఊపు ఊపేసింది. యూ ట్యూబ్ లోనూ అంతే జోరుగా వైర‌ల్ అయింది. దీంతో ఈ టైటిల్ ఆడియ‌న్స్ లోకి ఈజీగా వెళ్లిపోతుంది. మ‌రి టైటిల్ ఉన్నంత విష‌యం సినిమాలో ఉంటుందా? అన్న‌ది చూడాలి.