ఆ హీరోపై గోపిచంద్ మలినేని ఫోకస్

Tue Jan 24 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Gopichand Malineni focus on Venkatesh For Next Project

డాన్ శీను సినిమాతో దర్శకుడుగా మారి... సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఆ తర్వాత రెండో సినిమానే బాడీగార్డ్ అనే సినిమా చేశాడు. వెంకటేష్ హీరోగా జరిగే సినిమా ప్రేక్షకులను కొంతమేర అల్లరించలేకపోయినా... ఆ తర్వాత మళ్లీ రవితేజతో చేసిన బలుపు సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత పండుగ చేసుకో విన్నర్ లాంటి సినిమాలు పెద్దగా ఆడకపోయినా... మరోసారి క్రాక్ సినిమాతో ఆయన సూపర్ హిట్ అందుకున్నాడు. బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న గోపిచంద్ మలినేనికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.ఇప్పటికే ఆయన ప్రభాస్ సహా మరి కొందరు హీరోలకు కథలు చెప్పారని ప్రస్తుతం చర్చల స్టేజ్ లో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే గోపీచంద్ మాలినేనికి మరో బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తోంది.

ఆయనతో సినిమా చేసేందుకు సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థతో హీరో వెంకటేష్ సినిమా చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ తో ఒక ప్రాజెక్టు సెట్ చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

చివరిగా ఎఫ్3 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న వెంకటేష్ ఆ తరువాత ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. ఈరోజు ఆశ్చర్యకరంగా హిట్ సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను వెంకటేష్ కు ఆయన 75వ సినిమా చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

ఆ ప్రకటనలా వచ్చిందో లేదో వెంకటేష్ తో గోపీచంద్ కూడా సినిమా చేసేందుకు రంగం సిద్ధమైందనే వార్త తెరమీదకు వచ్చింది. ప్రస్తుతానికి గోపీచంద్ వీర సింహారెడ్డి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు.

బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాదు... నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. వాల్తేరు వీరయ్య సినిమాతో పోటీ పడి కొంతమేర వెనకబడిన సరే బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలవడంలో గోపీచంద్ పాత్ర ఉందని నందమూరి అభిమానులందరూ భావిస్తున్నారు


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.