అసలు డాన్ శీను మాస్ మహారాజా రవితేజ కాదా?

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

GopiChand Malineni About Don Seenu Movie

టాలీవుడ్ లో ఓ హీరో చేయాలనుకున్న కథలు మరో హీరో వద్దకు వెళ్లడం.. హిట్ లు సూపర్ హిట్ లు.. బ్లాక్ బస్టర్లు గా నిలవడం తెలిసిందే. ఇదే పంథాలో ఓ హీరోతో అనుకున్న స్టోరీ మరో హీరోతో చేయాల్సి వచ్చిందట. అదే 'డాన్ శీను'. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్రలో నటించారు. గోపీచంద్ మలినేని ఫస్ట్ మూవీ ఇది. 2010లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందించిన హీరోగా రవితేజ కెరీర్ కు మరింత ప్లస్ అయింది.అయితే ఈ సినిమా కోసం ముందు అనుకున్నది రవితేజని కాదంట. మరో హీరోతో చేయాలని దర్శకుడిగా తన తొలి సినిమాని ఓ రేంజ్ లో ఊహించుకున్నాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. ముందు ఈ స్టోరీని వినిపించింది మరెవరికో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంట. తనని ఉద్దేశించే ఈ కథ రాసుకున్నారట. రవితేజ కెరీర్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన ఈ మూవీని ముందు హీరో ప్రభాస్ కు వినిపించాడట.

తనకు బాగా నచ్చిందట. వెంటనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని కలిసి చేసేద్దామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట ప్రభాస్. అయితే అది అనివార్య కారణాల వల్ల కుదరలేదని ఆ తరువాతే అది హీరో రవితేజకు వెళ్లిందని తెలిసింది.

ప్రభాస్ చేసేద్దామని చెప్పడంతో గోపీచంద్ మలినేని కథని పూర్తి చేసే పనిలో వుండగానే పూరి జగన్నాథ్ తో 'ఏక్ నిరంజన్' ని మొదలు పెట్టాడట. దీంతో ప్రభాస్ ని పట్టుకోవాలంటే మరి కొన్నాళ్లు వేచి చూడక తప్పని పరిస్థితి.

అలా వేచి చూడలేక అదే కథని గోపీచంద్ మలినేని హీరో రవితేజకు వినిపించాడట. స్టోరీ నచ్చడం.. అమితాబ్ వీరాభిమాని క్యారెక్టర్ కావడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన 'వీర సింహారెడ్డి' ప్రమోషన్స్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని గుర్తు చేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ మూవీ 'వీర సింహారెడ్డి'. సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ఈ మూవీ దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి మంచి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.

ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో వున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. క్రేజీ స్టార్ల కోసం పవర్ ఫుల్ స్టోరీలని సిద్ధం చేసుకున్న గోపీచంద్ మలినేని అందులో ఓ స్టోరీని పవన్ కల్యాణ్ తో చేయాలనుకుంటున్నారట. పవన్ అప్పట్లో దొరికే అవకాశం లేకపోవడంతో యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో గోపీచంద్ మలినేని తన తదుపరి ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడట. మార్చిలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాల్ని మేకర్స్ వెల్లడించే అవకాశం వుందని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.