Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్-2'లో అదే హైలైట్ అవుతుందా..

By:  Tupaki Desk   |   4 April 2020 2:00 PM GMT
కేజీఎఫ్-2లో అదే హైలైట్ అవుతుందా..
X
కన్నడ స్టార్ హీరో యశ్ కేజీఎఫ్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. 2018 డిసెంబర్ లో విడుదలైన కేజీఎఫ్ మూవీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి సంచలనమే సృష్టించింది. అంతేగాక విడుదలైన అన్నీ బాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే కేజీఎఫ్ కి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాలుగా దేశవాప్తంగా వీరాభిమానులు హీరో యశ్ కేజీఎఫ్2 లో ఏం చేయబోతున్నాడో.. ఎలా కేజీఎఫ్ కి డాన్ అయ్యాడోనని చూడటానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తయిపోయిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.

కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ డెంజరస్ విలన్ అధీరా పాత్ర లో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ దేశ ప్రధాని పాత్రలో కనిపించనుందట. రవీనా పాత్ర నెగటివ్ షేడ్స్ తో డిజైన్ చేశారట. విలన్స్ అందరినీ చంపేసిన తర్వాత రాఖీభాయ్ కేజీఎఫ్ కింగ్ అవుతాడట. అలా ఎదిగిన రాఖీభాయ్ ని ప్రధాన మంత్రి రాజకీయ కుట్రల తో చంపిస్తుందని విశ్వసనీయ సమాచారం. తల్లి మాట కోసం రాఖీభాయ్ గొప్ప రాజుగా ఎదిగి సాధించి చూపిస్తాడని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇదిలా ఉండగా కేజీఎఫ్ లో రాఖీభాయ్ జీవితం ఏ మలుపు తిరుగుతుందో అని అభిమానులలో ఆసక్తి నెలకొంది. మరి కేజీఎఫ్2 లో హీరోయిజం మాములుగా ఉండదని మాత్రం ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. చూడాలి మరి త్వరలో ఎలాంటి సందేశం అందుతుందో.