ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై గుడ్ న్యూస్!

Mon Aug 15 2022 17:00:02 GMT+0530 (IST)

Good news on Prashant Neel - NTR project!

RRR తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ హాలీవుడ్ స్టార్స్‌ని డైరెక్టర్స్ రైటర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా పలు ప్రతిష్టాత్మక అవార్డు ఫంక్షన్ లలో వార్తల్లో నిలుస్తూ చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్ట్ లపై ప్రేక్షకుల్లో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి మొదలైంది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లని ప్రకటించారు. అందులో 30వ సినిమాగా కొరటాల శివతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని చేయబోతున్నట్టుగా ఎన్టీఆర్ పుట్టిన రోజు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంత వరకు ఈ మూవీ పట్టాలెక్కలేదు.

షూటింగ్ ప్రారంభం కావడానికి మరో నెల అయినా పట్టేలా వుందని ఇన్ సైడ్ టాక్ . ఇదిలా వుంటే 31వ ప్రాజెక్ట్ గా 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ అయినా ముందు స్టార్ట్ అవుతుందా? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ని అందించి దర్శకుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు.

ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాడో మీడియా సాక్షిగా క్లారిటీ ఇచ్చేశాడు. ఏపీలోని నీలకంఠాపురానికి వ్యక్తిగత పని మీద వెళ్లిన ప్రశాంత్ నీల్ ని అక్కడి మీడియా కలిసి ఎన్టీఆర్ సినిమాపై అప్ డేట్ ఇవ్వమని కోరింది.

ముందు కథ చెప్పాలా? అంటూ చమత్కరించిన ప్రశాంత్ నీల్ ఆ తరువాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు తాను దాదాపు 2ఏ ఏళ్లుగా అభిమానని అని ప్రాజెక్ట్ ఫైనల్ కాకముందు తనని క్యాజువల్ గా 10 నుంచి 15 సార్లు కలిశానని స్పష్టం చేసి షాకిచ్చారు.