Begin typing your search above and press return to search.

హిట్‌ 2 : డబుల్ ఫ్రాఫిట్స్ తో డబుల్‌ బ్లాక్ బస్టర్ 

By:  Tupaki Desk   |   10 Dec 2022 5:43 AM GMT
హిట్‌ 2 : డబుల్ ఫ్రాఫిట్స్ తో డబుల్‌ బ్లాక్ బస్టర్ 
X
అడవి శేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ 2 సినిమా డబుల్‌ బ్లాక్ బస్టర్‌ దిశగా దూసుకు పోతుంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిట్ 2 కు హిట్ టాక్ వచ్చింది.. అంతే కాకుండా కాలం కలిసి రావడంతో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. హిట్‌ 2 తో విడుదల అయిన సినిమాల్లో మించిన సినిమా ఏదీ లేదు. దాంతో హిట్ 2 కు భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.

రెండో వారం నుండి హిట్ 2 యొక్క కలెక్షన్స్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందని భావించిన వారికి షాక్ ఇస్తూ ఇప్పటికి కూడా కలెక్షన్స్ భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా బాక్సాఫీస్ వద్దకు పదికి పైగా సినిమాలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్‌ ని అవ్వలేదు. దాంతో హిట్‌ 2 ఈ వారం కూడా భారీ వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్‌. ఇప్పటికే లాభాల బాట పట్టిన హిట్ 2 డబుల్‌ ఫ్రాఫిట్స్ ను దక్కించుకోవడం ఖాయం.

అడవి శేష్‌ గత చిత్రం మేజర్‌ తో పాటు అంతకు ముందు సినిమాలు కూడా మంచి సక్సెస్ అవ్వడంతో ఆయన సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నమోదు అవుతున్నాయి. హిట్ 2 సినిమా పై ఉన్న అంచనాలను అందుకునే విధంగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించి ఒక చక్కని క్రైమ్‌ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందించడంతో భారీ విజయం నమోదు అయ్యింది.

హిట్ 2 మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను దక్కించుకుని ఇప్పుడు రెండో వారంలో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. మెజార్టీ థియేటర్లలో రెండవ వీకెండ్‌ లో కూడా అన్ని షో లు హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌ లో కూడా హిట్‌ 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ఇంకా కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.

వచ్చే వారం అవతార్‌ 2 రాబోతున్న విషయం తెల్సిందే. అప్పటి వరకు హిట్‌ 2 మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. హిట్‌ 2 సినిమా భారీగా వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా హిట్ 3 సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. నాని ఈ సినిమా తో మంచి లాభాలను దక్కించుకున్నాడు. అంతే కాకుండా హిట్ 3 లో తానే నటించబోతున్నాడు.