Begin typing your search above and press return to search.

సారేగామ‌కు `గాడ్ ఫాద‌ర్` ఆడియో హ‌క్కులు

By:  Tupaki Desk   |   3 July 2022 11:30 AM GMT
సారేగామ‌కు `గాడ్ ఫాద‌ర్` ఆడియో హ‌క్కులు
X
మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ రాజా తెర‌కెక్కిస్తున్న `గాడ్ ఫాదర్` ఫ‌స్ట్ లుక్ కి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. 4 జూలై 5.45 పీఎం ముహూర్తం ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంకో 24 గంట‌లే మిగిలి ఉంది. ఇంత‌కుముందే రిలీజ్ చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్ లో అంబ్రిల్లా గ్యాంగ్స్ లుక్ ఎంతో ఇంప్రెష‌న్ ని పెంచింది. డార్క్ షేడ్ ఉన్న పాత్ర‌లో చిరు న‌టిస్తున్నారు.

గాడ్‌ఫాదర్ కారు నుండి బయటకు వచ్చే వరకు అత‌డి కోసం వేచి చూసే గ్యాంగ్స్ ని పోస్టర్ లో ఆవిష్క‌రించ‌గా డార్క్ షాడో యాంబియెన్స్ ఆ వాతావ‌ర‌ణాన్ని గంభీరంగా ఆవిష్క‌రించింది. న‌గ‌రంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ మ్యాన్ రాక‌కు ఇది సింబాలిక్. వర్షం లో అందరూ గొడుగులు పట్టుకుని కనిపించ‌డం ఆస‌క్తిక‌రం. ఇందులో అగ్ర నాయిక న‌య‌న‌తార ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. స‌ల్మాన్ ఖాన్ స్పెష‌ల్ రోల్ తో స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

గాడ్ ఫాదర్ రాజకీయ అంశాలతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. మ‌ల‌యాళ బ్లాక్ బస్ట‌ర్ లూసిఫర్ కి అఫీషియల్‌గా రీమేక్‌. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ- సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

ఇంత‌లోనే ఆడియో రైట్స్ ని సారేగామ చేజిక్కించుకుంద‌ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు. గాడ్ ఫాద‌ర్ టైటిల్ కి త‌గ్గ‌ట్టే బీజీఎం మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. రేప‌టి సాయంత్రం ఫస్ట్ లుక్ లో మోష‌న్ పోస్ట‌ర్ థీమ్ మ్యూజిక్ సంథింగ్ స్పెష‌ల్ గా ఆక‌ర్షించ‌నుందిట‌.