గ్లోబల్ స్టార్ పుస్తకం వరల్డ్ నెం-1 సెల్లర్

Mon Sep 13 2021 23:00:01 GMT+0530 (IST)

Global Star Book World No 1 Seller

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎదిగిన వైనం ఎంతో ఇన్ స్పిరేషన్. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన పీసీ అటుపై బాలీవుడ్ లో నటిగా పరిచయం అయింది. కొన్ని దశాబ్ధాల పాటు బాలీవుడ్ ని ఏలింది. హాలీవుడ్ కి ప్రమోట్ అయి గ్లోబల్ స్టార్ గా వెలిగిపోయింది. ఇదంతా ఒక్క రాత్రిలో జరిగింది కాదు. కొన్ని సంవత్సరాల పాటు ప్రణాళిక బద్ధంగా కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకెళ్లింది. ఎగుడు దిగుడు కెరీర్ లో ఎన్నిటినో అధిగమించి ఆశించినది దక్కించుకుంది. వంచన.. అవమానాలు తనకు ఉన్నాయి. సర్జరీలతో అందం పరంగా కరెక్షన్ కి వెళ్లిన సందర్భాలున్నాయి. అన్నిటినీ పట్టుదలతో సాధించుకుంది.కాబట్టే నేడు గ్లోబల్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోంది. తాజాగా పీసీ టైటిల్ ఏదీ పెట్టకుండానే ఓ పుస్తకాన్ని రచించి మార్కెట్ లోకి రిలీజ్  చేసింది. ఇందులో  పీసీ కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది. అయితే ఈ బుక్   ప్రియాంక చోప్రా పూర్తిస్థాయి మనోగతానికి సంబంధించింది కాదు.  కేవలం  కొన్ని విషయాలన్ని మాత్రమే పంచుకుంది. భారతదేశంలో ఆమె ఎదిగిన వైనం.. మిస్ వరల్డ్ గా ఎంపిక కావడం.. బాలీవుడ్ లో ఆమె జీవితం ఎలా సాగింది.. అక్కడ నుంచి హాలీవుడ్ కి వెళ్లడం..  అటుపై నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వంటి కొన్ని విషయాలపైనే పీసీ ఫోకస్ చేసింది. వాటి గురించే క్లుప్తంగా పుస్తకంలో ప్రస్థావించింది.  ఇందులో ఆసక్తికర విషయాలతో పాటు చాలా ఫన్నీ  అంశాలు  కూడా ఉన్నాయని పీసీ తెలిపింది.

ఈ  పుస్తకాన్ని  కొంత ది రివ్యూ చేసారని..దానిపై సోషల్ మీడియా కొన్ని కామెంట్లు కూడా వచ్చాయని తెలిపింది. తన పూర్తి కథను ఇందులో రాయలేదని.. కెరీర్ ఆరంభంలో పడిన ఇబ్బందుల గురించి ఎక్కడా ప్రస్థావించలేదని నెటిజనులు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాల్ని  తెలిపారు. వాటికి బదులుగా పీసీ తన గురించి చెప్పాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని.. వాటిని పూర్తిగా చెప్పలేదని తెలిపింది. అయితే తన పుస్తకం మార్కెట్ లో వరల్డ్ నెంబర్ -1  బెస్ట్ సెల్లర్ గా అమ్ముడవుతోందని తెలిపింది. అందుకు రీడర్లకు గ్లోబల్ స్టార్ పీసీ  కృతజ్ఞతలు తెలిపారు.