శ్రీదేవి సోడా సెంటర్ సూరిబాబు గ్లింప్స్ అదిరెను

Tue May 11 2021 09:21:30 GMT+0530 (IST)

Glimpse Of Lighting Sooribabu

హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఆనంది కథానాయిక. ఇది రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్. మణి శర్మ సంగీతం అందిస్తుండగా సామ్ దత్ సైనూదీన్ సినిమాటోగ్రపీ అందిస్తున్నారు.70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా -శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ క్లాస్ ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. గోదారి నేపథ్యంలో మెజారిటీ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఇంతకుముందు సుధీర్ బాబు సోడా పట్టుకుని కనిపించే లుక్.. రగ్గ్ డ్ లుక్ లను రిలీజ్ చేయగా దానికి అభిమానుల నుంచి చక్కని స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి `గ్లింప్స్ ఆఫ్ లైటింగ్ సూరిబాబు` పేరుతో వీడియోని రిలీజ్ చేశారు. గోదావరి నదిలో మర బోట్ ప్రయాణాలు.. చిన్న టౌన్ లో శ్రీదేవి సోడా సెంటర్ కథేమిటి? అన్నది ఆసక్తికరం. ఇక ఇందులో సుధీర్ బాబు సూరిబాబు అనే పాత్రలో నటిస్తున్నారు. టీజర్ గ్లింప్స్ ఆద్యంతం సుధీర్ బాబు లుక్ ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది. సుధీర్ పర్ఫెక్ట్ ఫిట్ 8 - ప్యాక్ లుక్ ని తెరపై అందంగా ఆవిష్కరించారు. పచ్చని గోదారి జలాల్లో.. శ్రీదేవి సోడా సెంటర్ లో మాస్ యాక్షన్ ట్రీట్ కి కొదవేమీ ఉండదని ఈ గ్లింప్స్ ప్రామిస్ చేస్తోంది. ఇక ఇందులో కథానాయికను రివీల్ చేయకుండా..షాడో లుక్ లో చూపించి వదిలేశారు. మరోసారి పలాస రేంజులో నేటివిటీ టచ్ తో కరుణ కుమార్ మ్యాజిక్ చేస్తారనే అర్థమవుతోంది.