ఇంటర్ పోల్ అధికారి సోనాల్ మెరుపులే మెరుపులు

Tue Oct 04 2022 12:00:00 GMT+0530 (India Standard Time)

Glamours Sonal Chauhan In Silver Dress

కొంత గ్యాప్ తర్వాత నాగార్జున 'ది ఘోస్ట్' చిత్రంతో కంబ్యాక్ అవుతోంది సోనాల్ చౌహాన్. ఈ సినిమా విజయంపై సోనాల్ చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రస్తుతం కింగ్ తో కలిసి ఘోస్ట్ ప్రచారంలోనూ బిజి బిజీగా ఉంది. నాగార్జున -సోనాల్ చౌహాన్ కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్ అక్టోబర్ 5 న దసరా సందర్భంగా సినిమా హాళ్లలో విడుదలవుతోంది. విడుదల దగ్గర పడుతుండగా టీమ్ ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేస్తోంది.తాజాగా తమిళ వెర్షన్ ప్రమోషన్స్ కోసం కింగ్ నాగార్జునతో కలిసి సోనాల్ చెన్నైకి వెళ్లింది. సోనాల్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్లైట్ నుండి నాగార్జునతో ఉన్న ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు 'వణక్కం చెన్నై' అని క్యాప్షన్ ఇచ్చారు. రెండ్రోజుల క్రితమే నాగార్జున సోనాల్ చౌహాన్ ద ఘోస్ట్ టీమ్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు చెన్నైకి వెళ్లారు.

సోనాల్ లేటెస్ట్ ఫోటోషూట్ అంతే వైరల్ గా మారింది.  చెన్నైలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో సోనాల్ వెండితో డిజైన్ చేసిన ధగధగల గౌనులో మైండ్‌బ్లోయింగ్ లుక్ తో అందరినీ ఆశ్చర్యపరిచింది.

స్ట్రాప్ లెస్ సిల్వర్ సీక్విన్ డ్రెస్ లో థై స్లిట్ ఎలివేషన్ తో మతులు చెడగొట్టింది. సిల్వర్ లైనింగ్స్ …. అంటూ స్టార్స్ ఈమోజీలను సోనాల్ షేర్ చేసింది. ది ఘోస్ట్ అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఘోస్ట్ కథాంశం లీక్....!గ్యాంగ్ స్టర్ల నుండి తన సోదరిని  మేనకోడలును రక్షించే లక్ష్యంతో నాగార్జున ఎలాంటి సాహసాలు చేసాడన్నదే సినిమా. ఇందులో ఇంటర్ పోల్ అధికారి విక్రమ్ పాత్రలో అతడు కనిపిస్తాడు. సోనాల్ చౌహాన్ మరొక ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా ఈ సాహసోపేతమైన పనిలో ఘోస్ట్ కి సహాయం చేస్తుంది.

ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద చిరంజీవి 'గాడ్ ఫాదర్'తో పోటీపడుతున్న సంగతి తెలిసిందే.. ది ఘ్సోట్ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ - తమిళంలో విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ విడుదలైన వారం తర్వాత హిందీ వెర్షన్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని గుసగుస వినిపిస్తోంది. ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయి. కన్నడ - మలయాళం వెర్షన్ లను కూడా కలిసి విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ది ఘోస్ట్ తో పాటు  ప్రభాస్ ఆదిపురుష్ లోను సోనాల్ ఓ పాత్రలో మెరవనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.