అభినవ సీత సొగసుచూడతరమా

Tue Jan 24 2023 10:30:56 GMT+0530 (India Standard Time)

Glamours Looks Of Kriti Sanon

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సీతాదేవి పాత్రలని చేసే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే వచ్చింది. పాతకాలంలోకి వెళ్తే సీత అంటే వెంటనే గుర్తుకొచ్చేది అంజలిదేవి. సీత పాత్రలో ఉండే కరుణ అంతులేని ప్రేమ రసాన్ని ఆమె తన అభినయంతో చూపించి సీతాదేవి అంటే ఇలాగే ఉంటుందేమో అనే అభిప్రాయం అందరిలో కలిగించింది. ఈ జెనరేషన్ కి వచ్చేసరికి శ్రీరామరాజ్యం సినిమాలో నయనతార సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. అందులో నయనతార అభినయం కూడా అద్బుతంగా ఉంటుంది.ఒకప్పటి అంజలిదేవిని ఏ మాత్రం తీసిపోకుండా నటించి మెప్పించింది. ఆ తరువాత ఇప్పుడు ఆ అవకాశం బాలీవుడ్ బ్యూటీ పొడుగుకాళ్ల సుందరి కృతి సనన్ కి వచ్చింది. ఆదిపురుష్ సినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతుంది.

ఇక ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆదిపురుష్ లో సీతాదేవి పాత్రని కరుణరసానికి సింబాలిక్ గా కాకుండా కాస్తా ఫెరోసియస్ గా దర్శకుడు ఓంరౌత్ చూపించాలని అనుకుంటున్నాడు.

అందుకే కృతి సనన్ ని ఆ పాత్రకి ఎంపిక చేశాడు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన అందం అభినయంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఎలేస్తుంది. అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

అందంతో పాటు ఆమె కళ్ళల్లో కాన్ఫిడెన్స్ తో ఎలాంటి వారి చూపునైనా తన వైపుకి తిప్పుకునేలా చేస్తుంది. ఫోటోషూట్ లలో కూడా రొమాంటిక్ యాంగిల్ లో కూడా ఆమె డామినేషన్ కనిపిస్తుంది.

తాజాగా కృతి సనన్ ఫోటోషూట్ ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఎల్లో కలర్ మోడరన్ డ్రెస్ లో సోఫాపై కూర్చొని ఆమె చూపుల బాణాలు విసిరేస్తూ ఉంటే ఎవరైనా దాసోహం కావాల్సిందే అన్నంతగా కృతి రూపలావణ్యం మెరిసిపోతుంది. ఈ ఫోటోలకి కృతి సనన్ ఇన్స్టాలో ఏకంగా 2 లక్షల 23 వేలకి పైగా లైక్స్ రావడం విశేషం.  ఆ పోటోలని మీరు కూడా ఓ సారి చూసి తీరాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.