ఊరిస్తుందనుకున్న సోనాల్ ఉసూరుమనిపించిందే!

Sun May 29 2022 08:00:01 GMT+0530 (IST)

Glamours Beauty Sonal Chauhan

తెలుగు తెరపై గ్లామరసాన్ని ఒలికించిన కథానాయికలలో సోనాల్ చౌహాన్ ఒకరు. ఒక వైపున బాలీవుడ్ సినిమాలు చేస్తూనే .. మరో వైపున అవకాశాన్ని బట్టి తెలుగు సినిమాల్లోను మెరుస్తోంది. మధ్యలో ఏ మాత్రం కాస్త గ్యాప్  దొరికినా హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తుంటుంది. అందువల్లనే ఆమె వరుస సినిమాలు చేయకపోయినా ప్రేక్షకులకు గుర్తుంది. తెలుగులో ఇంతవరకూ  ఆమె బాలకృష్ణ సినిమాల్లోనే ఎక్కువగా చేసింది. బాలయ్యతో ఆమె చేసిన సినిమాల జాబితాలో 'లెజెండ్' .. 'డిక్టేటర్' .. 'రూలర్' కనిపిస్తాయి.ఫలానా సినిమాలో సోనాల్ ను తీసుకున్నారనేగాని అది గ్లామర్ వైపునుంచి అనుకుంటారు తప్పా ఏదో కీలకమైన పాత్ర ఇచ్చి ఉంటారని మాత్రం అనుకోరు. ఎందుకంటే సోనాల్ ఇంతవరకూ చేసింది గ్లామరస్ పాత్రలే .. ఆమెకి తెలిసింది కూడా అందాలను ఆరబోయడమే.

బరువైన పాత్రలను పోషించాలని సోనాల్ అనుకోవడం లేదు .. ఆమెను అలాంటి పాత్రలలో చూడాలని ఆడియన్స్ ఆశపడటం లేదు. ఆమె గ్లామరస్ పాత్రలలో కనుల పండుగ చేయాలనే కుర్రాళ్లు ఆశిస్తున్నారు .. ఆరాటపడుతున్నారు.

అలా 'ఎఫ్ 3' సినిమా కోసం సోనాల్ ను తీసుకున్నారని తెలియగానే కుర్రాళ్లకు ప్రాణం లేచొచ్చింది. ఒక వైపున తమన్నా  తళుకులు .. మరో వైపున మెహ్రీన్ మెరుపులు ఎలా తట్టుకోవాలా అనుకుంటూ ఉంటే బోనస్ గా సోనాల్ సొగసుల్ కూడా పలకరించనున్నాయి అనేసరికి కుర్రాళ్లంతా నాలుక అరిగిపోయేలా చప్పరించేశారు.

సినిమా మొదలైన దగ్గర నుంచి సోనాల్ ఎప్పుడు  .. ఎక్కడ .. ఎలా ఎంట్రీ ఇస్తుందా అని వెయిట్ చేశారు. అంతలో సోనాల్ రానే వచ్చింది .. కానీ ఆమె నుంచి ఎలాంటి సొగసుల సందడి లేదు .. అందాల హడావిడి లేదు.

సోనాల్ వెంకటేశ్ కలిసి హుషారెత్తిస్తుందా? వరుణ్ తేజ్ తో కలిసి పిచ్చెక్కిస్తుందా? అనుకుంటే ఆమె కాస్తా జెంట్ గెటప్ లో ఉన్న  తమన్నాకి లైనేసి తన కోసం కేటాయించిన ఒక్క పాటను తమన్నాతో పాడుకుని వెళ్లిపోయింది. అక్కడ కామెడీ వర్కౌట్ అయింది ... కుర్రాళ్ల రొమాంటిక్ ఆలోచనలు కూడా తలక్రిందులయ్యాయి. అలా ఉత్సాహంతో  ఉన్న పిలగాళ్లను సోనాల్ ఉసూరుమనిపించింది. ఇక పూజ హెగ్డే నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్టుగా సమయం సందర్భం లేకుండా వచ్చేసి .. ఒక పాటకి స్టెప్పులేసి సెలవు తీసుకుంది. ఏదేమైనా ఈ అందగత్తెలను అస్సలు నమ్మకూడదబ్బా!