గ్లామర్ క్వీన్ రంభ న్యూ లుక్ చూశారా?

Fri Sep 24 2021 05:00:02 GMT+0530 (IST)

Glamour Queen Rambha New Look

ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన `ఆ ఒక్కటీ అడక్కు` చిత్రంతో వెండితెరకు పరిచయమైంది రంభ. అప్పటి వరకు విజయలక్ష్మిగా వున్న ఆమెని ఈ సినిమాతో ఇవివి.. రంభగా పరిచయం చేశారు. తొలి సినిమాలో హాట్ గా నటించి రంభని తలపించింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపుని దక్కించుకుంది. అనతి కాలంలోనే తనదైన గ్లామర్ తో తెలుగు- తమిళ- కన్నడ- మలయాళ- హిందీ- బెంగాలీ- భోజ్ పురీ- ఇంగ్లీష్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.అప్పట్లో యువ హృదయాల్లో కలల రాణిగా క్రేజ్ ని సొంతం చేసుకుని యువ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇక క్రేజీ హీరోయిన్ గా తెలుగులో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు .. తమిళంలో వినీత్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు హిందీలో మిధున్ చక్రవర్తి నుంచి గోవిందా.. సల్మాన్ ఖాన్.. వినోద ఖన్నా.. అనిల్ కపూర్.. కన్నడలో జగ్గేష్ నుంచి ఉపేంద్ర .. రవిచంద్రన్ వరకు .. మలయాళంలో వినీత్ నుంచి మమ్ముట్టి వరకు బెంగాలీ భాషలో మిథున్ చక్రవర్తి నుంచి ప్రసేన్ జిత్ వరకు.. భోజ్ పురీలో రవికిషన్.. వరకు ఇలా టాప్ హీరోలతో కలిసి నటించింది.

`దొంగ సచ్చినోళ్లు` తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంద్రకుమార్ పద్మనాభంని వివాహం చేసుకుంది. గత కొంత కాలంగా వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తున్న రంభ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫొటోలని షేర్ చేసింది. ఏజ్ పెరగడంతో కొంత వన్నె తగ్గిన రభ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం విశేషం. ప్రస్తుతం రంభ దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని కథనాలొచ్చాయి. టాలీవుడ్ అగ్ర కథానాయికలందరి సరసన నటించిన రంభకు ఈ పరిశ్రమతో గొప్ప అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల కంబ్యాక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి