Begin typing your search above and press return to search.

పవన్ ను మోసం చేసే పాత్రలో గ్లామరస్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   20 Jun 2021 2:30 AM GMT
పవన్ ను మోసం చేసే పాత్రలో గ్లామరస్ బ్యూటీ..!
X
పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ ''హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు''. ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపించునున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రంలో నిధి అగర్వాల్ స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తోందని తెలుస్తోంది. అంతేకాదు ఇది నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్.. సినిమాలో వీరమల్లును మోసం చేస్తుందట. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న నిధికి.. ఇది పెద్ద అవకాశం అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఈ సినిమాతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ల సరసన చేరుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

'వీరమల్లు' సినిమా ఇప్పటికే 45 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా.. ఫస్ట్ పీరియాడికల్ సినిమా. దీనికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.