Begin typing your search above and press return to search.

ఎలాంటి డ్రెస్ లో అయినా కిక్ ఎక్కించే పూజాహెగ్డే

By:  Tupaki Desk   |   2 Feb 2023 11:00 PM GMT
ఎలాంటి డ్రెస్ లో అయినా కిక్ ఎక్కించే పూజాహెగ్డే
X
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే. ఈ అమ్మడు హిందీలో సల్మాన్ ఖాన్ కి జోడీగా ఒక సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

మరో వైపు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే గత ఏడాది పూజాహెగ్డే రాదేశ్యామ్ మూవీ మాత్రమే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తరువాత షూటింగ్ టైమ్ లో ఆక్సిడెంట్ కావడంతో ఆరు నెలలు బెడ్ కి పరిమితం అయ్యింది.

మళ్ళీ ఇప్పుడిప్పుడే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టడంతో మునుపటి అందాన్ని తిరిగి సొంతం చేసుకుంటుంది. ఇక చాలా కాలం తర్వాత పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోషూట్ తో సందడి చేసింది.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉన్నా కూడా పూజా హెగ్డే ఫోటోషూట్ లకి మాత్రం వెళ్ళలేదు. క్యాజువల్ లుక్స్ లోనే ఎక్కువగా దర్శనం ఇచ్చేది. అయితే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే మోడరన్ ట్రెడిషనల్ షూట్ కేక పుట్టిస్తుంది.

రీసెంట్ గా పూజాహెగ్డే అన్నయ్య పెళ్లి వేడుక జరిగింది. ఇందులో సందడి మొత్తం పూజాహెగ్డేది అని చెప్పాలి. ఇక ఈ పెళ్లి సంగీత్ లో భాగంగా బుట్టబొమ్మ వేసిన కాస్ట్యూమ్స్ కలర్ ఫుల్ గా ఆమె అందాన్ని రెట్టింపు చేసే విధంగా ఉంది.

ఇలాంటి లుక్ లో పూజా పాపని చూసి చాలా రోజులైంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం విశేషం. ఇక ఈ అమ్మడు హాట్ లుక్స్ తో ఆ ట్రెడిషనల్ ట్రెండీ కాస్ట్యూమ్స్ చూసి అబ్బో అని కళ్ళు అలా వదిలేస్తున్నారు. ఇక ఈ ఫోటోలని ఏకంగా 9,63 లక్షల మందికి పైగా లైక్స్ చేయడం విశేషం. ఇక త్వరలో పూజా హెగ్డే మహేష్ బాబు మూవీ షూటింగ్ సెట్ లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.